ముందు చెప్పినట్టు “పోసాని” గారు “బిగ్ బాస్” షోలో ఎందుకు లేరో తెలుసా..? ఇదే అసలు కారణం!

బిగ్ బాస్ షో కోసం చాలామంది సెల‌బ్రెటీల పేర్ల‌ని ప‌రిశీలించారు. అందులో పోసాని కృష్ణ‌ముర‌ళి పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. ముక్కుసూటిగా ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడ‌డం, కావ‌ల్సినంత డ్రామా పండించ‌డం పోసాని ప్ర‌త్యేక‌త‌లు. పోసాని మ‌న‌స్త‌త్వం ఇలాంటి షోల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతుంది. అందుకే ఎలాగైనా స‌రే, పోసానిని ప‌ట్టుకుని రావాల‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. పోసానిని సంప్ర‌దింపులు జ‌రిపారు. పోసాని కూడా ఈ షో చేయ‌డానికి అంగీక‌రించాడ‌ట‌. అయితే… ”రూ.3 కోట్లు కావాలి.. అదీ సింగిల్ పేమెంట్” అంటూ ష‌ర‌తు విధించాడ‌ట‌. దాంతో.. నిర్వాహ‌కులు డ్రాప్ అయ్యార‌ని తెలుస్తోంది.

>>>WATCH BIG BOSS SHOW FULL EPIODE1<<<

పోసాని ఆ స్థాయిలో అడ‌గ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఈ షో కోసం 70 రోజుల కాల్షీట్లు స‌ర్దుబాటు చేయాలి. మ‌ధ్య‌లో గ్యాప్ లేకుండా 70 రోజులూ షోకే అర్పించాలి. పోసాని డిమాండ్ ఉన్న ఆర్టిస్టు. రోజుకి ఎంత‌కాద‌న్నా.. ల‌క్ష సంపాదిస్తున్నాడు. అంటే 70 ల‌క్ష‌లు వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డి ఈ షోకి వ‌స్తున్నాడ‌న్న‌మాట‌. ఈ 70 రోజుల్లో ఓ హిట్ సినిమా ప‌డినా చాలు.. పోసాని మ‌ళ్లీ విజృంభిస్తాడు. క్రేజూ, పారితోషికం పెర‌గొచ్చు. బిగ్ బాస్‌కి వెళ్ల‌డం వ‌ల్ల‌.. ఇవ‌న్నీ వ‌దులుకోవాల్సివ‌స్తోంది. అందుకే.. పోసాని ఈ స్థాయిలో డ‌బ్బులు డిమాండ్ చేశాడ‌ట‌. అంత ఇచ్చుకోలేక‌.. బిగ్ బాస్ నిర్వాహకులు మ‌రో ఆప్ష‌న్‌ని ఎంచుకొన్నారు.

ALSO READ: TROLLS ON BIG BOSS SHOW

Comments

comments

Share this post

scroll to top