అనంతపూర్ లో ఆదరణ లభించకనే బలగం ఎక్కువగా ఉన్న చోట్ల పోటీ చేస్తున్న పవన్.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం తరువాత జనాలని బాగా ఆకర్షించారు, గత ఎన్నికల్లో టీడీపీ కి సపోర్ట్ ఇచ్చారు, ఈ సారి ఎన్నికల్లో బి.ఎస్.పి పార్టీ తో కలిసి పోటీ చేస్తున్నారు, ఆయన ఇది వరకు అనంతపూర్ నుండి పోటీ చేస్తా అని తెలిపారు, కానీ ఆయన చెప్పినట్టు ఈ సారి ఎన్నికల్లో అనంతపూర్ నుండి పోటీ చెయ్యట్లేదు. కానీ ఆయన పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాలు హాట్ టాపిక్ అయ్యాయి.

ఆ రెండే ఎందుకు.?

గాజువాక, భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో,ఆయన వర్గం వాళ్ళు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నారు, అందుకే ఆయన గాజువాక మరియు భీమవరం నుండి పోటీ చేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, గెలుపు విషయం పక్కన పెడితే, అనంతపూర్ నుండి ఎందుకు పోటీ లో నిలబడలేదు అనే ప్రశ్న నే ఎక్కువ మందికి వస్తుంది.

కులాలకు అతీతం కానీ.. :

నేను కులాలకు మతాలకు అతీతం అని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెబుతూ ఉంటారు, మరి ఆయన బలగం ఎక్కువగా ఉన్న చోట్లే ఎందుకు పోటీ చేస్తున్నారు అంటే దానికి సమాధానం జనసేన పార్టీ లోని పెద్దలు, మేధావులు, అభిమానులు తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నారు. అంటే ఎక్కడి నుండి పోటీ చేయాలన్నది కూడా ఆయన నిర్ణయించుకోలేరా.? మొదట చెప్పిన విధంగానే ఆయన అనంతపూర్ నుండి పోటీ చేసి ఉంటే రాయలసీమ లో జనసేన కు కొంత బలం చేకూరేది.

ఉత్తరాంధ్ర గోదావరి.. అంతేనా.?

గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, ఏలూరు… ఈ ఏరియా లు అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం. ఎంత అంటే ఈ ఏరియా లలోనే ఎక్కువగా పర్యటిస్తుంటారు ఆయన. బహుశా తెలుగు రాష్ట్రం లో అంచలంచలుగా పైకి రావాలనేది ఆయన పధకం కావొచ్చు. అందుకే పై నుండి నరుక్కొని వస్తున్నారు. కానీ కిందికి వచ్చి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేసరికి చెయ్యి దాటిపోతుందా.? రాయలసీమ ను పట్టించుకొనే సరికి అక్కడ ఆయనకున్న అభిమాన వర్గం కూడా తగ్గిపోతుందేమో అని రాయలసీమ రాజకీయ విశ్లేషకుల మాట.

సులువు కాదు.?

గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గెలవాలి అంటే అంత సులువు కాదు. కానీ మొదటి సారి పోటీ చేస్తున్న మూలాన, ఆయన బలగం మద్దతు తో పాటు, యువత మద్దతు కూడా బలంగా ఉండటం తో రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన గెలిచే అవకాశం ఉంది. ఎంత మెజారిటీ తో గెలుస్తారు అనే విషయం ఎన్నికల ఫలితాల తరువాతనే తెలియనుంది.

 

Comments

comments

Share this post

scroll to top