త్రివిక్రమ్ చెప్పింది నచ్చలేదు…కానీ “అజ్ఞ్యాతవాసి” లో “ఖుష్బూ” నటించడానికి అసలు కారణం ఇదే.!

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి నిన్న రిలీజ్ అయి మిశ్రమ స్పందనతో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. . ఈ చిత్రంలో  ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి ఖుష్బూ ప్రముఖ పాత్ర పోషించారు. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అభిమానులకు పండుగలాంటిదే.ఇదే విషయంలో  ఖుష్బూకూడా సంతోషంగా ఉన్నారు.అయితే ఇన్నేళ్లు తెలుగు సినిమాలెందుకు చేయలేదు.. ఈ సినిమాలో నటించడానికి కారణం ఏంటి అనే విషయాలకు చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు ఖుష్బూ..అవేంటో ఆమె మాటల్లోనే..

“చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నా. తెలుగే కాదు తమిళ సినిమాల్లోనూ నటించలేదు. ఇది నాకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లాంటిది. కాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకునేలా నా పాత్ర ఉండాలి. “అజ్ఞాతవాసి”లో నా పాత్ర అలాంటిదే.సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఎవరైనా తన పాత్ర పవర్ఫుల్ గా ఉండడమే కాదు..ప్రేక్షకులు తనను మళ్లీ యాక్సెప్ట్ చేసేలా ఉండాలనుకుంటారు..  ఆ లక్షణాలన్ని ఖుష్బూకు ఇందులో నచ్చి నటించారట..ఇంకా ఏం చెప్పారో తెలుసా.. త్రివిక్రమ్‌ ఈ పాత్ర గురించి నాకు వివరించినప్పుడు చాలా నచ్చింది. చెప్పాలంటే.. త్రివిక్రమ్‌ గతంలోనూ నాకు చాలా స్క్రిప్ట్‌లు వినిపించారు. కానీ, నాకు అవేవీ నచ్చలేదు. ‘అజ్ఞాతవాసి’లో నా పాత్ర గురించి వివరించే ముందు “మేడం.. ఈ పాత్రకు మాత్రం నో చెప్పకండి” అన్నారు. అంత మంచి పాత్ర నాకు ఇస్తే.. నేను నో ఎందుకు చెప్తాను?” అని అన్నారట ఈమె.

అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడంపై మాట్లాడుతూ.. “పవన్‌ చాలా కూల్‌. తక్కువగా మాట్లాడతారు. ఆయనతో నటించడం సౌకర్యంగా ఉంటుంది. చిత్రబృందం నన్ను కుటుంబంలో ఒకరిగా చూసుకున్నారు” అని ఆ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు..గతంలో  స్టాలిన్ సినిమాలో చిరుకి అక్కగా నటించిన ఖుష్బూ,ఈ సినిమాలో పవన్ కి పిన్నిగా నటించారు..

Comments

comments

Share this post

scroll to top