“మాన్ అఫ్ ది మ్యాచ్” జడేజా ను నెక్స్ట్ మ్యాచ్ “సస్పెండ్” చేసారు..! ఈ వీడియో చూస్తే అసలు కారణం తెలుస్తది!

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన కనపర్చిన.. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై వేటు పడింది. మూడో టెస్టుకు అతడు దూరం అయ్యాడు. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక టెస్ట్‌ మ్యాచ్‌ నిషేధానికి గురయ్యాడు. అతడి స్థానంలో కుల్ దీప్ యాదవ్ ఆడే అవకాశముంది. పల్లెకెలెలో మూడో టెస్టు ఈ నెల 12న ప్రారంభంమవుతుంది.

24 నెలల వ్యవధిలో జడేజా 6 అపరాధ (డీమెరిట్‌‌) పాయింట్లు తెచ్చుకోవడంతో ఐసీసీ నియమ నిబంధనల ప్రకారం అతడిపై చర్య తీసుకున్నారు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో 58వ ఓవర్‌లో చివరి బంతి వేసిన జడేజా తన చేతిలోకి వచ్చిన బాల్‌ను బ్యాట్స్‌మన్‌ దిముత్‌ కరుణరత్నే వైపు విసిరాడు. అతడు క్రీజ్‌ వదలనప్పటికీ ప్రమాదకరంగా బంతిని విసిరినట్టు ఫీల్డ్‌ అంపైర్లు గుర్తించారు. తాజా ఉల్లంఘనతో అతడు 6 అపరాధ పాయింట్లు తెచ్చుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించించారు. అప్పుడు అతడికి 3 డీమెరిట్‌ పాయింట్లు వచ్చాయి. తాజాగా మరోసారి ఐసీసీ కోడ్‌ బ్రేక్‌ చేయడంతో వాటితో కలుపుకుని వచ్చిన 6 అపరాధ పాయింట్లను ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు సస్పెన్షన్‌ పాయింట్లుగా మార్చారు. దీని ప్రకారం ఒక టెస్ట్‌ లేదా రెండు వన్డేలు, లేదా రెండు టి20లు ఏది ముందైతే అది ఆడకుండా నిషేధం విధిస్తారు. ఈ నేపథ్యంలో జడేజా మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top