“పెన్ క్యాప్” కు టాప్ లో హోల్ (కన్నం) ఎందుకు ఉంటుందో తెలుసా.? వెనకున్న షాకింగ్ కారణం ఇదే.!

చాలామందికి ఒక బలహీనత ఉంటుంది.ఎంత పెద్దవాళ్లైనా ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం..మరీ ముఖ్యంగా  ఎక్కువమందికి  పెన్ను నోట్లో పెట్టుకునే అలవాటుంటుంది..కొంతమంది ఏకంగా ఆ పెన్ను క్యాప్ తీసి నోట్లో పెట్టుకుని నమిలేస్తుంటారు..పిల్లలు పొరపాటున పెన్ను క్యాప్ నోట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది.ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా..మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతి ఏడాది వందమంది చనిపోతున్నారట ..కేవలం పెన్ను క్యాప్ నోట్లో పెట్టుకోవడం మూలంగా..దీనికి పెన్నుల కంపెని ఒక పరిష్కారం ఆలోచించింది అదేంటో తెలుసుకోండి..
మనకు గొంతులో ఏదన్నా అడ్డం పడితే ఊపిరి తీసుకోవడానికి ఎంత కష్టం అవుతుంది.సరిగ్గా ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పెన్నుల కంపెని పెన్నులను తయారుచేస్తుంది…కంప్యూటర్స్,మొబైల్స్ వచ్చాక అందరూ టైపింగ్ పైనే దృష్టి పెట్టి ,చేతి రాత రాసేవాళ్లు తక్కువయ్యారు..దాంతో  చాలా వరకు పెన్నుల వాడకం తగ్గిపోయింది.అయితే ఈ రోజుకీ పెన్నును కొన్ని ముఖ్యమైన పనులకు వినియోగిస్తున్నారు. కాగా అమెరికాలో పెన్ను క్యాపుల కారణంగా ప్రతీయేటా వందమంది వరకూ చనిపోతున్నారని ఒక అధ్యయనంలో తేలింది.
కొంతమంది పెన్నువాడే సందర్భంలో దాని క్యాపును నోట్లో పెట్టుకోవడం మూలంగా ప్రమాదవశాత్తూ అది నోటిలోకి చేరి, గొంతుకు అడ్డంపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆ అధ్యయనంలో తేలింది. ఈ తరహా ప్రమాదాలను నివారించేందుకే పెన్నుల కంపెనీలు… పెన్నుల క్యాపులకు హోల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా పెన్ను క్యాపు గొంతులో చిక్కుకున్నప్పటికీ, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది ఏర్పడకపోవచ్చు. అందుకే పెన్ను కొనుక్కునే ముందు దాని క్యాప్ కి హోల్ ఉందో లేదో చూసుకోండి..లేదంటే ప్రమాదం మీ పెన్ను క్యాప్ రూపంలో మీ పక్కనే పొంచి ఉండొచ్చు..జాగ్రత్త….

Comments

comments

Share this post

scroll to top