అన్నపూర్ణ స్టూడియోలో “అగ్ని ప్రమాదం” జరగడానికి అసలు కారణం ఇదేనా..? మీడియాను నాగార్జున ఎందుకు లోపలికి పంపట్లేదు?

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టుడియోలో భారీ అగ్నిప్రమాదం హీరో నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో కాలిపోయింది ‘మనం’ సినిమా సెట్ అని.. తన తండ్రితో కలిసి చివరిసారిగా నటించిన సెట్ కావడంతో దాన్ని ఆయన గుర్తుగా ఉంచుకున్నామని అది ప్రమాదంలో కాలిపోవడం చాలా బాధగా ఉందన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకుండా సురక్షితంగా బయట పడటం చాలా ఆనందంగా ఉందన్నారు.


కాగా ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాను లోపలికి అనుమతించలేదు. దీంతో మీడియాకు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని అక్కడకు చేరుకున్న నాగార్జునను ప్రశ్నించగా.. ఇది ప్రైవేటు ప్రాపర్టీ అని.. పబ్లిక్ ప్రాపర్టీ అయితే తాను అడ్డు చెప్పేవాడిని కాదంటూ మీడియాకు సర్దిచెప్పారు నాగార్జున.

కాగా అగ్నిప్రమాదంలో కాలిపోయింది మనం సెట్ అని.. ఆ సెట్‌కు అప్పట్లో రూ.2 కోట్ల వరకూ ఖర్చు చేశామన్నారు. ఇటీవల చాలా చిత్రాలు ఆ సెట్‌లో చిత్రీకరణ జరుపుకున్నాయని.. సమంత, తాను కలిసి నటించిన ‘రాజు గారి గది-2’ మూవీలో కొన్ని సీన్లు ఇదే సెట్‌లో చిత్రీకరించామన్నారు. నాన్న గారి గుర్తుగా ఈ సెట్‌ను అలాగే ఉంచుతున్నామని అయితే ఆయనే లేనప్పుడు సెట్ కాలిపోవడం పెద్ద విషయం కాదన్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంపై వెంటనే స్పందించిన పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్‌మెంట్ వారికి ధన్యవాదాలు తెలిపారు నాగార్జున.

watch video here:

అయితే ఈ ప్రమాదంకి కారణం ఏంటి అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారా.? పూర్తిగా స్టాఫ్ నిర్లక్షమే అని వార్త వినిపిస్తుంది. సెట్ లో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో అగ్ని ప్రమాదం సంభవించింది అంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top