శుక్రవారం వర్షం పడకపోయినా…మూడో టీ 20 ఎందుకు రద్దయ్యిందో తెలుసా..? కారణం ఇదే..!

నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టీ20 మ్యాచ్ రద్దు అయింది. చివరి టీ20 అభిమానులకు తీవ్ర నిరాశపరిచింది. అయితే నిన్న వర్షం పడలేదు…కానీ మ్యాచ్ ఎందుకు రద్దు అయ్యింది? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. ముందు నుండి వరుణుడు ఆటంకం కలిగిస్తాడేమో అని భయపడ్డారు క్రికెట్ అభిమానులు. కానీ నిన్న వర్షం పాడకపోయినా మ్యాచ్ రద్దు అయ్యింది. కారణం ఏంటో మీరే చూడండి!


ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. తొలుత అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ వాయిదా పడింది. తర్వాత 7:45 గంటలకు మరోమారు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రౌండ్ తడి ఆరకపోవడం.. ఇంకా వర్షం వచ్చే సూచనలు కనిపించడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ 1-1 తో సమం అయింది. గురువారం ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. రోజూలానే భారీ వర్షం పడడంతో మైదానం తడిసి ముద్దయింది. దీంతో శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ కాస్త రద్దు అయ్యింది..!

watch video here:

ఇది ఇలా ఉండగా చాన్నాళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది. ఈ సమయంలో అంఫైర్లు మ్యాచ్ రద్దు నిర్ణయాన్ని తెలియజేయడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. రెండు వారాల కిందటే టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు పోటెత్తడంతో ఆరు గంటలకల్లా గ్యాలరీ నిండిపోయింది. అయితే మైదానం తడిగా ఉందని ఏడు గంటలకు అంఫైర్లు మైదానాన్ని పరిశీలిస్తారని స్టేడియంలోని స్క్రీన్‌పై మెసేజ్‌ రావడంతో అందరిలో కాస్త ఆందోళన మొదలైంది.

నగరంలో గత పదిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మ్యాచ్‌పై ముందు నుంచే అనుమానాలు నెలకొన్నాయి. కానీ, ఎంత వానొచ్చినా.. మ్యాచ్‌కు ముందు రెండు గంటలు తెరిపిస్తే మైదానాన్ని సిద్ధం చేస్తామని హెచ్‌సీఏ అధికారులు చెబుతూ వచ్చారు. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉందని, రెండు సూపర్‌ సాపర్లు అందుబాటులో ఉన్నాయని.. అవుట్‌ ఫీల్డ్‌ను మొత్తం కవర్లతో కప్పి ఉంచుతున్నామని చెప్పారు. అయినా హెచ్‌సీఏ మైదానాన్ని సిద్ధం చేయలేకపోయుంది.

మ్యాచ్‌ రద్దు కావవడంతో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లిస్తామని యాజమాన్యం తెలిపింది. అయితే ఏ రోజు ఇస్తారు అనేది ఇంకా కంఫర్మ్ గా చెప్పలేదు!

Comments

comments

Share this post

scroll to top