నాలుగేళ్ల కుర్రాడు… అరకొర బట్టలేసుకునే వాళ్లందరికీ బుద్ది చెప్పాడు!

ఫ్యాషన్ నడినెత్తి మీదికెక్కి వెస్ట్రన్ టైప్ డిస్కో డాన్స్ చేస్తుంటే …. ఆ మత్తులో జోగుతున్న  మన వాళ్లు వేసుకునే బట్టలు మాత్రం రోజురోజుకి కుంచించుకుపోతున్నాయ్.  ఒంటి నిండా కప్పుకున్న చీర దగ్గరి నుండి లాంగ్ లెంగ్త్, హాఫ్ స్కర్ట్స్ , మిడ్డీస్ దాటి ఇప్పడు చడ్డీలా దాక వచ్చింది ఆ కల్చర్. మన సంస్కృతికి పుల్ స్టాప్ పెట్టి పక్కదేశాల కల్చర్ కు గ్రీన్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తున్నాం.  ఇటువంటి వారందరికీ  పర్ఫెక్ట్ సమాధానం ఇచ్చాడు  ఓ నాలుగేళ్ల కుర్రాడు. ఇది షార్ట్ ఫిల్మ్ యే కావొచ్చు కానీ చాలా చక్కని సందేశాన్ని, సూటిగా గుండెలకు హత్తుకుపోయేలా ఇచ్చారు .

ఓ చిన్న ఫ్యామిలీ.. అమ్మా,నాన్న, ఓ నాలుగేళ్ల కుర్రాడు. వీకెండ్ కావడంతో ఓ రెస్టారెంట్ కు వెళ్లి..తమ లంచ్  ముగించుకొని బయటకి వస్తుంటారు. ఇంతలోనే షాప్ బయట ఓ ధీనస్థితిలో ఉన్నఓ ముసలామెను చూసి , కుర్రాడి తండ్రి కార్ లో నుండి తన టీషర్ట్ ను తీసి ఆమెకు ఇస్తాడు. వెంటనే  ఆ నాలుగేళ్ల కుర్రాడు కూడా అదే కార్ నుండి  ఓ టవల్ ను తీసుకొని రెస్టారెంట్ లోకి పరిగెడతాడు…అక్కడ అరకొర బట్టలతో ఉన్న ఓ యువతి మీద కప్పుతాడు. ఇదే అంశాన్ని చాలా చక్కగా షార్ట్ ఫిల్మ్ లో చూపించారు.

Watch Video:

 

CLICK: థియేటర్ లోకి వాటర్ బాటిల్ ను అనుమతించనందుకు 11 వేల నష్టపరిహారం.

 

Comments

comments

Share this post

scroll to top