ఆర్మీలో ప‌నిచేస్తున్న ఓ అధికారి జీవితంలో జ‌రిగిన య‌దార్థ ఘ‌ట‌న ఇది. రియ‌ల్ స్టోరీ..!

”ఆర్మీలో 20 సంవ‌త్సరాల నుంచి ప‌నిచేస్తున్నా. ఎన్నో మెడ‌ల్స్ అందుకున్నా. నా దేశానికి నేను సేవ చేస్తున్నందుకు నాకు ఎంతో గ‌ర్వంగా ఉంటుంది. కానీ నా జీవితంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న మాత్రం న‌న్ను ఇప్ప‌టికీ క‌ల‌చివేస్తుంది. అది 1997 జూన్ 13వ తేదీన జ‌రిగింది. ఆ రోజున ఢిల్లీలోని గ్రీన్ పార్క్‌లో ఉన్న ఉప్‌హార్ సినిమా థియేట‌ర్‌లో బార్డ‌ర్ సినిమా చూస్తున్నాం. ఉన్న‌ట్టుండి తెర వెనుక చిన్న‌గా పొగ రావ‌డం మొద‌లైంది. దాన్ని కొంద‌రు ప్రేక్ష‌కులు గ‌మ‌నించారు. వెంట‌నే బ‌య‌ట‌కు ప‌రిగెత్త‌డం మొద‌లు పెట్టారు. నిమిషాల్లోనే థియేట‌ర్‌లో మంట‌లు వ్యాపించాయి. దీంతో థియేట‌ర్‌లో ఉన్న జ‌నాలు ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వెళ్లేందుకు య‌త్నించారు. ఆ తొక్కిస‌లాటలో నేనూ ఉన్నా.

అయితే నా ల‌క్ష్యం ఒక్క‌టే. ఎలాగైనా మంట‌ల్లో చిక్కుకున్న వారిని కాపాడాల‌ని. అదే ప్ర‌య‌త్నం చేశా. కానీ జ‌నాలు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల నేను వారి ద‌గ్గ‌రికి వెళ్ల‌లేక‌పోయా. ఆ అగ్ని ప్ర‌మాదంలో 59 మంది చ‌నిపోయారు. ఎంతో మంది గాయ‌ప‌డ్డారు. ఆ సంఘ‌ట‌న నా జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డా ఆ 59 మందిని ర‌క్షించ‌లేక‌పోయానే అన్న బాధ నాకు ఇప్ప‌టికీ క‌లుగుతుంది. అప్పుడ‌ప్పుడు ఆ సంఘ‌ట‌న గుర్తుకు వ‌స్తుంటుంది. అయినా ఏం చేస్తాం, మ‌న చేతుల్లో ఏమీ లేదు క‌దా, నేను 100 శాతం ప్ర‌య‌త్నించా. ఆర్మీ అధికారిని అయి ఉండి కూడా ఎవ‌రినీ ర‌క్షించ‌లేక‌పోయాన‌నే బాధ ఇప్ప‌టికీ న‌న్ను వెంటాడుతూనే ఉంటుంది.

ఆ త‌రువాత చాలా ఏళ్ల వ‌ర‌కు పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని అనుకున్నా. అలాగే ఉండిపోయా. ఆ స‌మ‌యంలో నాకు క‌లిసింది మ‌నీషా. ఆమె వ‌చ్చాక నా జీవితంలో ఏదో తెలియ‌ని మార్పు వ‌చ్చింది. దేశానికి సేవ చేస్తూ ఎన్నో మెడ‌ల్స్ సాధించా. బ‌హుశా ఆమె రాక‌పోతే ఆ మెడ‌ల్స్ అందుకునే వాడిని కాదేమో. మా జీవిత ప్ర‌యాణంలో ఓ బాబు కూడా మాకు తోడ‌య్యాడు. ఇప్ప‌టికీ మేం బ‌య‌టికి వెళ్లి థియేట‌ర్‌లో సినిమా చూస్తుంటే నాకు ఎగ్జిట్ ద్వారం వైపే దృష్టి ఉంటుంది. ఏమో.. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. కానీ ఈసారి ప్ర‌మాదం జ‌రిగితే మాత్రం నా శాయ‌శ‌క్తులా కృషి చేసి అంద‌రినీ కాపాడుతా. ఎందుకంటే నేను చేసేది ఆర్మీలో. మా డ్యూటీ దేశాన్ని, దేశ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డం. అంతే, నా బాధ్య‌త నేను క‌చ్చితంగా నిర్వ‌ర్తిస్తా అనే న‌మ్మ‌కం ఉంది..!”

— ఓ ఆర్మీ అధికారి జీవితంలో జ‌రిగిన య‌దార్థ ఘట‌న ఇది. రియ‌ల్ స్టోరీ..!

Comments

comments

Share this post

scroll to top