అత‌ని మీదున్న అభిప్రాయం…ఆ ఒక్క సంఘ‌ట‌న‌తో మ‌టుమాయం.! #రియ‌ల్ స్టోరి.

ఢిల్లీలో జాబ్ రాగానే…ఆఫీస్ లో ఉండే మ‌రో ముగ్గురితో క‌లిసి…ఓ రూం తీసుకున్నాం.! అంతా….ఓకే బ‌ట్ మా రూమ్ మేట్స్ లో రాకేష్ మాత్రం మాకు అర్థం కాడు! మేమంతా సినిమాకెళ్దాం అంటే వాడు నేను రాను మీరు వెళ్ళండి అంటాడు, రెస్టారెంట్ కి వెళ్దాం అంటే సేమ్ అన్స‌ర్….షాపింగ్ కు అంటే కూడా అదే ఆన్సర్.! దీంతో మేం ముగ్గురం మాత్ర‌మే వెళ్ళే వాళ్లం…వాడు మాత్రం రూమ్ నుండి క‌దిలే వాడు కాదు.! కానీ ప్ర‌తి నెల ఫ‌స్ట్ సండే మాత్రం…ఉద‌య‌మే రూమ్ నుండి బ‌య‌లు దేరి..అర్థ‌రాత్రి ఎప్ప‌టికో వ‌చ్చేవాడు. ఎక్క‌డికి వెళ్లావ‌ని మేం అడ‌గం, అడిగినా వాడు చెప్ప‌డు.!! వాడంటేనే మాకు కోపం, అస‌హ్యం పెరిగిపోతూ ఉన్నాయి. ఇక వాడిని రూమ్ నుండి పంపించాల‌నుకుంటున్న త‌రుణంలో………

ఓ రోజు మా ఫ్రెండ్స్ కోసం ఓ టెంపుల్ ద‌గ్గ‌ర వెయిట్ చేస్తున్నాను. అక్క‌డ ఓ వ్య‌క్తి, అక్క‌డి వీధి బాల‌ల‌కు పండ్లు, చాక్లెట్స్ , బిస్కెట్స్ పంచుతున్నాడు. అత‌ని ద‌గ్గ‌రికెళ్ళి, వావ్ మీరు చాలా గ్రేట్ అండీ…ఇంత చిన్న వ‌య‌స్సులో స‌మాజ సేవ చేయాల‌నుకునే మీ ఆలోచ‌న‌కు హ్యాట్సాఫ్ అని చెప్పాను…అంత‌లో అత‌ను..ఇందులో నాదేం లేదు…అంతా అక్క‌డున్నాడే ఆ వ్య‌క్తిదే అని ట‌క్ వేసుకొని గుడి ద‌గ్గ‌రి బిచ్చ‌గాళ్ళ‌తో ముచ్చ‌టిస్తున్న వ్య‌క్తిని చూపించాడు.

అత‌నిని ప‌ల‌క‌రిద్దామ‌ని ద‌గ్గ‌రికెళ్ళాను…హ‌లో అన‌గానే అత‌ను ఇటు తిరిగి చూశాడు. అత‌డే రాకేష్…ఒక్క‌సారిగా షాక్ అయ్యా..ఓ నిమిషం పాటు ఇద్ద‌రం మాట్లాడ‌కుండా ఉండిపోయాం.!! వెయిట్ ఈ ఫ్ర్యూట్స్ ఇచ్చేసి వ‌స్తాన‌ని…త‌న ప‌నిని పూర్తిచేసుకొని నా ద‌గ్గ‌రికొచ్చాడు రాకేష్.!

ఏంట్రా రాకేష్ ? ఒక్క‌సారైనా చెప్ప‌లేదేంటి రా…!? అని అడ‌గ్గానే వాడిలా చెప్పుకొచ్చాడు. చెప్పేదేముందిరా…మాది వ్య‌వ‌సాయ కుటుంబం, అమ్మ ఇంట్లోనే ఉంటుంది..ఇంటికొచ్చిన ఎవ‌రికైనా ఒట్టిచేతుల్తో పంపేది కాదు. ఉన్నంత‌లో వారి క‌డుపునింపే పంపేది. సో ఆమె నుండి నాకు ఆ అల‌వాటు వ‌చ్చింది.! ప్ర‌తి నెల ఇదిగో ఇలా అన్నాడు. మ‌రి ఇంటికి పంపవా నీ శాల‌రీ? దీనికి అత‌ని స‌మాధానం…సగం డ‌బ్బు ఇంటికి, మిగిలిన స‌గంలో స‌గం నాకు, స‌గం ఇదిగో ఇలా పండ్లు, దుప్ప‌ట్ల‌కు ఖ‌ర్చు చేస్తా…అని చెప్పాడు. అప్పుడ‌ర్థ‌మైంది నాకు… ఇందుకేనా వీడు మాతో సినిమాల‌కు, హోట‌ల్స్ కు రానిదని.! పైసా ఖ‌ర్చు చేయాల‌న్నా…ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించే వాడి వెనుక ఇంత గొప్ప స్టోరి ఉంద‌ని ఆ రోజు అర్థ‌మైంది. ఆరోజు నుండి నాకు వాడో రియ‌ల్ హీరో.

Comments

comments

Share this post

scroll to top