ఆమె ఏడుస్తూ ఒక్క‌సారిగా రిక్షా దూకేసింది.. రైల్వే ట్రాక్స్ వైపు ప‌రిగెత్తింది.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..? – రియ‌ల్ స్టోరీ

మాకెప్పుడూ కూతురు కావాల‌ని ఉండేది. కానీ ముగ్గురూ కొడుకులే పుట్టారు. అదేంటో.. తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చిన‌ట్టు.. అంద‌రికీ దాదాపుగా ఇలాగే అవుతుంది కదా. కూతురు కావాల‌ని మేం అనుకుంటే.. దేవుడు మాకు ముగ్గురు కొడుకుల‌నే ఇచ్చాడు. స‌రే.. ఈ మాట ప‌క్క‌న పెట్టండి. నేను ఇప్ప‌టికి 30 ఏళ్లు అవుతోంది, రిక్షా కార్మికుడిగానే బ‌తుకుతున్నా. రిక్షా తొక్క‌డం రోజూ వ‌చ్చిందాంతో తిని జీవించ‌డం ఇదే మా ప‌ని. అప్పుడెప్పుడో అనుకుంటా, జ‌రిగింది ఈ సంఘ‌ట‌న. ఇప్ప‌టికీ అది నా క‌ళ్ల ముందు మెదులుతూ ఉంటుంది.

ఆ రోజు ఉద‌యాన్నే అనుకుంటా. ఓ తండ్రి త‌న కూతుర్ని నా రిక్షాలో ఎక్కించాడు. చాలా జాగ్ర‌త్త‌గా తీసుకెళ్ల‌మ‌ని చెప్పాడు. కూతురికి కూడా జాగ్ర‌త్త‌లు చెప్పాడు. రిక్షాలో గ‌ట్టిగా ప‌ట్టుకుని కూర్చో, లేదంటే ప‌డిపోతావ్ అని కూతుర్ని హెచ్చ‌రించాడు. ఆమె అలాగే ప‌ట్టుకుని కూర్చుంది. చేతిలో ఓ సెల్‌ఫోన్ ఉంది. తండ్రి అటు వెళ్ల‌గానే ఆమె ఏడుపు లంకించుకుంది. ఎందుకో తెలియ‌దు. ఎవ‌రికో ఫోన్ చేసింది. ఏడుస్తూనే మాట్లాడుతోంది. నేను వెన‌క్కి తిరిగి చూశా. నన్ను తిట్టింది. కోప్ప‌డింది. వెనక్కి ఎందుకు తిరిగి చూస్తున్నావ్‌, అని ఆమె నాపై అరిచింది. వెంట‌నే నేను నా మానాన రిక్షా తొక్క‌డం ప్రారంభించా. చూస్తుంటే ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్‌తో ఎక్క‌డికైనా పారిపోయే ప్లాన్‌లోనో ఉన్న‌ట్టు అనిపించింది నాకు.

ఇంతలో ఆమె ఒక్క ఉదుట‌న రిక్షా నుంచి దూకింది. వేగంగా ప‌క్క‌నే ఉన్న రైల్వే ట్రాక్స్ వైపు ఆమె ప‌రిగెత్తింది. నేను రిక్షాను ప‌క్క‌నే పెట్టి, ఆమె వెనుకే ప‌రిగెత్తా. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోన‌ని కంగారుగా, వేగంగా ఆమె వెంట వెళ్లా. ఆమె రైల్వే ట్రాక్స్ చేరి అక్క‌డే ఆగింది. కొంత సేపు అలాగే ఉంది. బాగా ఏడుస్తుంది. అలా 3 గంట‌ల పాటు ఉన్నాక అప్పుడు వ‌ర్షం మొద‌లైంది. అప్పుడు ఆమె నాతో చెప్పింది, నువ్వు వెళ్లిపో, నన్ను ఇక్క‌డే ఉండ‌నియ్యి, ఇక‌పై న‌న్ను చూడకు, క‌ల‌వ‌కు, మా ఇంటి ద‌గ్గ‌రికి కూడా రాకు, నేను ఎవ‌రో తెలియ‌ద‌న్న‌ట్టు ఉండు, నా గురించి మ‌ర్చిపో.. అని ఆమె నాతో చెప్పింది. చేసేదేం లేక వెనుదిరిగా.

ఆ త‌రువాత 8 ఏళ్ల‌కు అనుకుంటా. ఓ రోజున నాకు యాక్సిడెంట్ అయింది. చుట్టూ ఉన్న వారు హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అప్పుడే ఓ లేడీ డాక్ట‌ర్ నాకు క‌ట్టు క‌ట్టి చికిత్స చేస్తోంది. చాలా రోజులైంది క‌దా, ఆమెను గుర్తు ప‌ట్ట‌లేదు. ఆ రోజున నాకు ఆ మాట‌లు చెప్పి వెళ్లిపోయింది క‌దా, ఆమె ఈవిడే. పోల్చుకోవ‌డానికి టైం ప‌ట్టింది. అప్పుడే ఆమె న‌ర్సుకు చెబుతోంది, పెద్ద డాక్ట‌ర్‌ను తీసుకుర‌మ్మ‌ని. వెంట‌నే కొద్ది సేప‌ట్లో పెద్ద డాక్ట‌ర్ వ‌చ్చాడు. అతనితో ఆమె ఏదో ఇంగ్లిష్‌లో చెప్పింది. అది నాకు అర్థం కాలేదు. ఆ త‌రువాతే తెలిసింది, ఆమె న‌న్ను త‌న తండ్రి అని ఆ డాక్ట‌ర్‌తో చెప్పింది. ఆ విష‌యాన్ని ఆమే స్వ‌యంగా నాతో త‌రువాత చెప్పింది. నా క‌ళ్లు చెమ‌ర్చాయి. నాకు కూతురు అలా ల‌భించినందుకు. ఆమె త‌రువాత మ‌ళ్లీ నాతో ఓ మాట అన్న‌ది. నువ్వు ఆ రోజు అక్క‌డ అంత సేపు లేక‌పోతే నేను ఈ రోజు డాక్ట‌ర్‌ని అయ్యేదాన్ని కాద‌ని అన్న‌ది. ఆ త‌రువాత నాకు అనిపించింది, ఆమె నాకు కూతురే కాదు, దేవుడిచ్చిన డాక్ట‌ర్ కూతుర‌ని అనిపించింది..!

— బ‌బ్లూ షేక్ అనే ఓ 55 ఏళ్ల వృద్ధుడి జీవితంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ ఇది..! – రియ‌ల్ స్టోరీ

Comments

comments

Share this post

scroll to top