ఇది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా?.

అది మార్చి 23, 1994. అత‌ని పేరు రోనాల్డ్ ఓప‌స్‌. ఆ రోజున అత‌ను 10 అంత‌స్తుల భ‌వనంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. అయితే ఆ భ‌వంతికి 8వ అంత‌స్తులోనే చుట్టూ ఓ నెట్ ఏర్పాటు చేశారు. ఎవరు భ‌వ‌నం పై నుంచి కింద ప‌డినా ర‌క్ష‌ణగా ఉంటుంద‌ని ఆ ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో అత‌ను ఆ నెట్‌లో ప‌డ్డాడు. కానీ అప్ప‌టికే ఓ బుల్లెట్ అతనికి త‌గిలి ప్రాణాలు కోల్పోయాడు. అలా ఓ వైపు ప్రాణాలు పోతూనే మ‌రో వైపు 8వ అంత‌స్తులో ఉన్న నెట్‌లో ప‌డిపోయాడు. దీంతో అత‌నిది హ‌త్యా, ఆత్మ‌హ‌త్యా అని తేల్చే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు.

ronald-opus

వారు వృద్ధ దంప‌తులు. ఆ వ‌య‌స్సులోనూ చీటికీ మాటికీ గొడ‌వ ప‌డుతుంటారు. అలా గొడ‌వ‌ప‌డిన‌ప్పుడ‌ల్లా భ‌ర్త త‌న భార్య‌ను షాట్ గ‌న్‌తో బెదిరిస్తుంటాడు. మాట విన‌క‌పోతే గన్‌తో కాల్చి చంపుతాన‌ని అంటుంటాడు. అలా అయినా ఆమె దారికి వ‌స్తుంద‌ని అత‌ని ఆలోచ‌న‌. అదే క్ర‌మంలో మార్చి 23, 1994 రోజున త‌న భార్య‌తో గొడ‌వ ప‌డిన‌ప్పుడు కూడా గ‌న్‌తో బెదిరిస్తాడు. అయితే ఎప్పుడు బెదిరించినా అందులో బుల్లెట్స్ ఉండ‌వు. ఊరికే బెదిరించ‌డం కోస‌మే అత‌ను అలా చేస్తాడు. ఆ రోజున కూడా అలాగే బెదిరిస్తాడు. అయితే స‌హ‌జంగానే అందులో బుల్లెట్స్ లేవ‌ని ఆ భ‌ర్త భావించినా ట్రిగ్గ‌ర్ నొక్కే సరికి ఒక్క‌సారిగా బుల్లెట్ అందులోంచి దూసుకు వ‌స్తుంది. దాని దెబ్బ‌కు అత‌ని భార్య త‌ప్పించుకుంటుంది. కానీ అదే బుల్లెట్ కిటికీలో నుంచి బ‌య‌టికి వెళ్లి అప్పుడే కింద‌కి ప‌డుతున్న రోనాల్డ్ ఓప‌స్‌కు త‌గులుతుంది. దీంతో ఆ వృద్ధ దంప‌తులు మొద‌ట ఖంగు తింటారు.

ఈ క్రమంలో రోనాల్డ్ ఓప‌స్ మృత‌దేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు ఏం చెబుతారంటే… అతని చావుకు అత‌నే కార‌ణ‌మ‌ని… అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని అంటారు. ఏంటీ… షాక్ అయ్యారా..? ఇప్పుడు చెప్పింది క‌ల్ప‌నాత్మ‌క క‌థ కాదు. నిజంగా జ‌రిగిందే. మ‌రి చంపింది ఆ వృద్ధ దంప‌తుల్లో భ‌ర్త అయితే రోనాల్డ్ ఓప‌స్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు అంటారేంట‌బ్బా… అని ఆలోచిస్తున్నారా..! అక్క‌డికే వ‌స్తున్నాం… అస‌లు నిజానికి రోనాల్డ్ ఓప‌స్ ఎవ‌రో కాదు. ఆ వృద్ధ దంప‌తుల ఒక్క‌గానొక్క కొడుకు. అత‌ను వ్య‌స‌న ప‌రుడు. ఈ క్ర‌మంలో అత‌ను డ‌బ్బులు దుబారా చేస్తున్నాడ‌ని తెలిసిన అత‌ని త‌ల్లి అత‌నికి పాకెట్ మ‌నీ క‌ట్ చేయిస్తుంది. దీంతో విసుగు చెందిన రోనాల్డ్ ఓ ద‌శ‌లో… అంటే తాను చ‌నిపోవ‌డానికి స‌రిగ్గా 6 వారాల ముందు స‌ద‌రు షాట్ గ‌న్‌లో బుల్లెట్లు లోడ్ చేస్తాడు. దాంతోనైనా త‌న తండ్రి త‌న త‌ల్లిని బెదిరించిన‌ప్పుడు ఆమె మ‌ర‌ణిస్తుంద‌ని అత‌ని అభిప్రాయం. అయితే వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌ర‌గ‌క‌పోవ‌డం, త‌ల్లి మృతి చెంద‌క‌పోవ‌డం కార‌ణంగా రోనాల్డ్ క‌ల‌త చెంది, తీవ్ర మ‌నస్థాపానికి లోనై త‌మ భ‌వంతి పై అంత‌స్తు నుంచి అది మార్చి 23, 1994న దూకుతాడు. ఈ క్రమంలో యాదృచ్ఛికంగానే అత‌ని త‌ల్లిదండ్రుల మ‌ధ్య గొడ‌వ జరుగుతుంది. అదే స‌మ‌యంలో ఎప్పుడూ బెదిరించిన‌ట్టుగానే అత‌ని తండ్రి అత‌ని త‌ల్లిని గ‌న్‌తో బెదిరించి ఫైర్ చేస్తాడు. అనుకోకుండా అప్పుడే భ‌వ‌నం నుంచి దూకిన రోనాల్డ్‌కు అది 9వ ఫ్లోర్ వ‌ద్ద తాకుతుంది. 8వ ఫ్లోర్ వ‌ద్ద అత‌ను నెట్‌లో ప‌డిపోతాడు. ఇదీ… జ‌రిగిన అస‌లు క‌థ‌. దీన్ని అక్క‌డి పోలీసులు ప‌లువురు సాక్షుల క‌థ‌నం ప్ర‌కారం చేధించారు.

మ‌రి రొనాల్డ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు ఎలా అవుతుందీ అంటే… అత‌ని తండ్రి ఎప్పుడూ గ‌న్‌లో బుల్లెట్లు లోడ్ చేయ‌లేదు క‌దా. కేవ‌లం త‌న భార్య ను బెదిరించ‌డం కోసమే అన్‌లోడెడ్ గ‌న్‌తో ఫైర్ చేసిన‌ట్టు న‌టించేవాడు. ఆ క్ర‌మంలో త‌న‌కు చంపే ఉద్దేశం లేదు. ఉండ‌దు. మ‌రి అందులో రోనాల్డ్ కావాల‌నే బుల్లెట్లు లోడ్ చేశాడు క‌దా. అంటే… అత‌ని ఉద్దేశం త‌ల్లి చావాల‌నే. క‌నుక అతనే హ‌త్య చేసిన‌ట్టు. మ‌రి హ‌త్య‌కు గురైంది ఎవ‌రు..? అత‌నే… క‌నుక అత‌ను త‌న‌ను తానే చంపుకున్న‌ట్టు లెక్క‌. ఈ క్ర‌మంలో అదే ప‌దాన్ని తిప్పి చెబితే ఏమ‌వుతుంది..? అది ఆత్మ‌హ‌త్య అవుతుంది. క‌నుకే రోనాల్డ్ ఓప‌స్‌ది ఆత్మ‌హ‌త్య అని తేల్చారు పోలీసులు..! దీన్ని బ‌ట్టి చూస్తే మ‌న‌కు ఓ సామెత గుర్తుకు వ‌స్తుంది క‌దూ..! అదేనండీ… ఎవ‌రు తీసుకున్న గొయ్యిలో వారే ప‌డ‌తార‌ని..! పైన చెప్పిన సంఘ‌ట‌న‌లో అది అక్ష‌రాలా నిజ‌మేన‌నిపిస్తుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top