ప్రేమ పేరిట మోసపోయి ఆత్మ‌హ‌త్య చేసుకుందామ‌నుకున్న ఓ యువ‌తి రియ‌ల్ స్టోరీ ఇది..!

”నేను కాలేజీలో ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో చేరా. అప్పుడే అమ‌న్ (పేరు మార్చాం) ను మొద‌టి సారిగా చూశా. అనుకోకుండా అత‌నితో ఫ్రెండ్‌షిప్ ఏర్ప‌డింది. అత‌ను నాకు అతి త‌క్కువ స‌మ‌యంలోనే మంచి ఫ్రెండ్ అయ్యాడు. అత‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నాకు కొత్త‌గా క‌నిపించేవాడు. నాకోసం పువ్వులు, గిఫ్ట్‌లు తెచ్చేవాడు. ఎందుకో అలాంటి స‌మయాల్లో అత‌ను నాకు ఓ స్పెష‌ల్ వ్య‌క్తి అనిపించేవాడు. అలా అత‌ను నాకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ త‌రువాత అత‌ని ప‌ట్ల నాలో ఏవో ఫీలింగ్స్ క‌లగ‌డం ప్రారంభమైంది. త‌రువాత తెలుసుకున్నా.. అవి రొమాంటిక్ ఫీలింగ్స్ అని. అంతే త‌రువాత ఇద్ద‌రం ప్రేమ‌లో మునిగి తేలాం.

నాలుగేళ్ల పాటు ఇద్ద‌రం ప్రేమించుకున్నాం. ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఒక‌ర్ని విడిచి ఒక‌రం ఉండ‌లేం అన్నంత ద‌గ్గ‌ర‌య్యాం. కానీ… స‌డెన్‌గా ఎందుకో అన్నీ మాకు వ్య‌తిరేకంగా జ‌ర‌గడం ప్రారంభ‌మ‌య్యాయి. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వలు రావ‌డం స్టార్ట్ అయింది. అత‌ను న‌న్ను చీటికీ మాటికీ విసిగించుకునేవాడు. అయినా నేను అత‌న్ని వ‌దల్లేదు. ఇంకా ద‌గ్గ‌ర‌య్యా. కానీ… అతను మాత్రం న‌న్ను దూరంగా పెడుతూ వ‌చ్చాడు. చివ‌ర‌కు నేను అత‌నికి చెప్పా. ఇక మ‌న‌కి కుద‌ర‌దని. విడిపోదాం అని చెప్పా. అందుకు అత‌ను షాక్ తిన్నాడు. న‌న్ను వేడుకున్నాడు. బ‌తిమాలాడు. అయినా నేను విన‌లేదు. నో అని చెప్పా.

అప్పుడే అత‌నిలో ఉన్న మృగాడు బ‌య‌టికొచ్చాడు. నేను అత‌నితో గ‌డిపిన స‌మ‌యంలో తీసుకున్న న‌గ్న ఫొటోల‌ను అత‌ను ఇంట‌ర్నెట్‌లో పెడ‌తాన‌ని బెదిరించ‌డం మొద‌లుపెట్టాడు. నాకేం చేయాలో తెలియ‌లేదు. అత‌న్ని ఎదిరిస్తే అత‌ను ఎంత‌టికైనా తెగిస్తాడ‌ని భావించా. ఒక వేళ ఆ ఫొటోలు నా కుటుంబ స‌భ్యుల కంట ప‌డితే, లోకం మొత్తం చూస్తే… ఆ మాట‌ల‌నే భ‌రించ‌లేక‌పోయా. ఎప్ప‌టిలా అత‌నికి మెసేజ్‌లు పెడుతూ ట‌చ్‌లో ఉండ‌డం ప్రారంభించా. చివ‌ర‌కు ఓ రోజున అత‌నే ఫోన్ చేశాడు. తాను వేరే అమ్మాయిని ల‌వ్ చేస్తున్నాన‌ని చెప్పాడు. నాతో అలా ప్ర‌వ‌ర్తించినందుకు సారీ చెప్పాడు. ఇక జీవితంలో క‌నిపించ‌న‌ని అన్నాడు. అప్పుడే నాక‌నిపించింది, లోకం విడిచి వెళ్లిపోవాల‌ని. ఈ మనుషుల మ‌ధ్య ఉండాల‌నిపించ‌లేదు. ఆ ఒత్తిడిలోనే డిప్రెష‌న్‌తో కొన్ని నెల‌లు గ‌డిపా. చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నా. కొత్త జీవితం జీవించ‌డం ప్రారంభించా. నా జీవితం.. నేను… అంతే… ఇంకెవ‌రూ నాక‌క్క‌ర్లేదు..!”

— ప్రేమ‌లో ఓ యువ‌కుడి చేతిలో మోస‌గింప‌బ‌డిన ఓ యువ‌తి య‌దార్థ గాథ ఇది. రియ‌ల్ స్టోరీ. ఈ స్టోరీని డాక్యుమెంట‌రీగా తీశారు. కావాలంటే కింద చూడ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top