ప్రేమంటే ఇదే… ఆ భార్యాభ‌ర్త‌ల ప్రేమ చూస్తే ఎవ‌రికైనా క‌న్నీళ్లు వ‌స్తాయి తెలుసా..?

”నా భార్య క‌ద‌లడానికి వీల్లేదు. అందుకనే నేనే వంట చేస్తాను. ఉండేది మేమిద్ద‌ర‌మే క‌నుక నాకు వంట చేసేందుకు అంత‌గా ఇబ్బంది అనిపించ‌దు. నాకు ఇబ్బంది క‌లిగించే విష‌యం ఒక్క‌టే.. అది.. నా భార్య‌ను అలా మంచంపై చూడ‌డం. అందుకే ఆమెను వీల్ చెయిర్‌లో ప‌క్క‌నే కూర్చోబెట్టుకుంటాను. మ‌రీ ముఖ్యంగా వంట చేసే స‌మ‌యంలో. అప్పుడు నాకు ఆమె సూచ‌న‌లు ఇస్తూ ఉంటుంది. దాని ప్ర‌కారం నేను వంట చేస్తాను. ఈ సారి కూడా కూర‌లో కారం వేయ‌డం మ‌రిచిపోయాను. కాదు, కావాల‌నే వేయ‌లేదు. ఎందుకంటే నా భార్య కారం తిన‌రాదు కాబ‌ట్టి. అలా ఆమె 6 సంవత్సరాల నుంచి జీవిస్తోంది.

ఇంట్లో బాగా సేపు ఉంటే బోర్ కొట్టి అప్పుడ‌ప్పుడూ బ‌య‌ట‌కు వ‌స్తాం. ప‌క్క‌నే వీల్ చెయిర్‌లో నా భార్య‌ను కూడా తీసుకొస్తా. కొంత‌సేపు ఇద్ద‌రం అలా ప్ర‌కృతి ఒడిలో గ‌డుపుతాం. ఆ స‌మయంలో ఆమె న‌న్ను అడుగుతుంది, త‌న‌కు న‌డ‌వాల‌నే కోరిక ఉంద‌ని చెబుతుంది. కానీ ఏం చేస్తాం, త‌ల‌రాత అలా ఉంది. ఆమె న‌డ‌వ‌లేదు. ఆ విష‌యం ఆమెకు చెప్ప‌లేను. అది చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక పండుగ పూట ఆమెకు చీర కొని తెచ్చా. కొడుకు త‌న కోసం పంపాడ‌ని చెప్పా. ఆమె వెంట‌నే ప‌సిగట్టింది. ఇలాంటి చీర‌ల‌ను ఎన్ని కొంటావు అని అడిగింది. అందుకు నేను స‌మాధానం చెప్ప‌లేదు. ఎందుకంటే స‌మాధానం చెప్పి ఆమెను ఇంకా నొప్పించే ప‌ని నేను చేయ‌లేను. ఎందుకంటే ఆమె ఇంకా ఎన్ని రోజులు బ‌తుకుతుందో తెలియ‌దు క‌దా.

ఆమె నా నుంచి ఎప్పుడైనా దూర‌మ‌వ‌చ్చు. క‌నుక‌నే ఆమె మ‌న‌స్సుకు బాధ క‌ల‌గ‌కుండా వీలైనంత వ‌ర‌కు సంతోషంగా చూసుకుంటున్నా. నిజంగా ఆమె లేక‌పోతే నేను ఉండ‌లేను. ఆమె లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నేను బయ‌టికి వెళ్లిన‌ప్పుడు ఇంట్లో ఆమె ఒక్క‌తే ఉంటుంది. బ‌య‌ట తాళం పెట్టి వెళ‌తా. తిరిగి వ‌చ్చి చూసే స‌రికి ఆమె స‌వ్యంగా ఉందా, లేదా అని వెంట‌నే త‌లుపు తెరిచి చూస్తా. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు, ఆమె నా నుంచి దూరం అవ‌చ్చు, అందుకే బ‌యటికి వెళ్లి రాగానే వెంట‌నే త‌లుపు తెరుస్తా. దాన్ని చూసి ఆమె అంటుంది, ఎందుక‌లా… ఏమైంది..? అని..! నేనేమీ బ‌దులు చెప్ప‌ను. అంతే, చెప్ప‌లేను. ఆమె ఉన్నంత వ‌ర‌కు ఆమెను బాగా చూసుకోవ‌డ‌మే ఇప్పుడు నే చేసే ప‌ని. ఆమె ఇంకెంతకాలం నాతో ఉంటుందో తెలియ‌దు. ఉన్నంత కాలం ఆమెతో నేను క‌చ్చితంగా ఉండాల్సిందే.”

— రోఫిక్ షేక్ అనే ఓ వృద్ధుడు మంచాన ప‌డిన త‌న భార్య కోసం ప‌డుతున్న త‌పనే ఇది. రియ‌ల్ స్టోరీ..!

Comments

comments

Share this post

scroll to top