ఆటోడ్రైవర్ మాటలకు ఆమె ఏడ్చేసింది.!

ఆమె పేరు షాలినీ గిరీష్… ముంబాయ్ లో జాబ్ చేస్తుంది. కానీ ఆమె ప్రాపర్ మాత్రం చెన్నై. ఆ రోజు తనకు పని ఎక్కువగా ఉండడంతో, పనంతా ముగిసాకా ఆఫీస్ నుండి బయలు దేరింది. అప్పటికే  గడియారం 7 చూపిస్తుంది. త్వరగా ఆఫీస్ నుండి బయలు దేరి..రోడ్డు మీద నిలబడ్డది. అటునుండి వెళుతున్న ఆటోవాలా ను పిలిచి, బాబూ కాలాచౌకి కి వస్తావా..? అని అడిగింది,  వస్తా మేడమ్, ఎంతిమ్మంటావ్, 80 ఇవ్వండి.. సారే పదా..అంటూ ఆటోలో ఎక్కింది షాలినీ.  మంచి మ్యూజిక్ స్లో సౌండ్ లో పెట్టి ఆటోను కాలాచౌక్ వైపు 60 స్పీడ్ లో తీసుకెళుతున్నాడు డ్రైవర్.

అంతలోనే షాలినీ గిరీష్ కు ఫోన్ వచ్చింది. ఫోన్ రింగ్ సౌండ్ వినిపిచగానే మ్యూజిక్ ఆఫ్ చేసాడు డ్రైవర్ తన ఆటోలో….  హా.. అమ్మా అంతా బాగున్నారా? అయ్యో…. ఆంటీ వాళ్ళ ఇళ్ళు కొట్టుకుపోయిందా..? ఆ ఊర్లో ఉన్న మన బంధువులు ఎలా ఉన్నారు? ఇప్పుడైనా వరదలు తగ్గాయా? అంటూ యోగక్షేమాలడిగి ఫోన్ పెట్టేసింది షాలినీ.

మేడమ్ మీది చెన్నైయా? అని అడిగాడు ఆటోడ్రైవర్.. ఆ అవును, అక్కడి నుండే అమ్మ ఫోన్ చేసింది. మీ వాళ్లంతా సేఫ్ గా ఉన్నారా? మేడమ్ టివిలలో ఎప్పుడూ జలదిగ్బంధంలో చెన్నై అని చూపిస్తున్నారు. ఆ.. మా వాళ్లంతా ఓకే కానీ మా బంధువుల ఇండ్లలో కొన్ని కూలిపోయాయ్.. చాలామంది రోడ్ల మీద ఉంటున్నారట.!   అవునా… ఎంత దారుణం కదా మేడమ్,  ప్రకృతి కన్నెర చేస్తే ఎవరైనా ఏం చేస్తాం!

auto-my-story-750x500

ఆ…ఆ….ఆ… ఇక్కడే ఆపు,  నేను దిగుతా… బ్రేక్ వేశాడు ఆటో డ్రైవర్, ఇదిగో తీసుకో అంటూ 100 రూపాయల నోటును అతనికి ఇచ్చింది షాలినీ, వద్దు మేడమ్, మీసిటీ చాలా కష్టాల్లో ఉంది కదా.. నా తరఫున ఇవి అక్కడికి పంపించండి, నా కారణంగా ఈ సమయంలో అక్కడి ఓ వ్యక్తి రెండు పూటలు కడుపు నిండా తింటే చాలు. ఎంతోమంది చెన్నై వాళ్లు నా ఆటో ఎక్కారు..పాపం ఇప్పుడు వాళ్లెలా ఉన్నారో..? తలుచుకుంటూనే బాధేస్తుంది అంటూ ఆటో తిప్పుకొని వెళ్ళిపోయాడు.

అతని మాటలకు షాలినీ కళ్లవెంట నీళ్లొచ్చాయ్… మన వాళ్లు సేఫా, మనవాళ్ళు సేఫా అంటూ వర్షం స్టార్ట్ అయినప్పటి నుండి ఫోన్ చేసిన నేను, ఆపదలో ఉన్న నా సొంత నగరం గురించి ఇంత వరకు ఆలోచించలేకపోయానే ? ఇప్పటి వరకు చెన్నై మొహం కూడా చూడని ఆ ఆటోడ్రైవర్ తనకు తోచిన సహాయం చేస్తే,చెన్నైలో పుట్టి, పెరిగిన నేను మాత్రం ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నానేంటీ అంటూ.. రాత్రంతా నిదురపోలేదు.

మార్నింగ్ లేచిన షాలినీ…… తన అకౌంట్ నుండి ఓ 50 వేల రూపాయలు డ్రా చేసి, మొత్తం 50,080/- రూపాయలను తీసుకొని చెన్నై బయలు దేరింది..కొంతలో కొంతైనా తన రుణం తీర్చుకునే పనిలో…!!!

Comments

comments

Share this post

scroll to top