బాహుబలిని పొలిటికల్ ఫెచింగ్ కు వాడుకుంటున్న కృష్ణం రాజు??

బాహుబలిని క్రియేటివ్ ఆలోచనలు ఉన్న వారు స్పూఫ్ కు ప్రేరణగా వాడుకున్నారు. బాహుబలి ని బేస్ గా తీసుకొని  ఎన్నో.. కొత్త ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు. ఇక విడుదలకు ముందు బాహుబలి చేసిన హడావిడి.. విడుదల తర్వాత  కూడా  కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఫిల్మ్ నగర్ నుండి ఓ కొత్త ఆరోపణ  బయటకు వచ్చి ,  చక్కర్లు కొడుతుంది. బాహుబలి పొలిటికల్  పరంగా కూడా ఉపయోగపడుతోందని పుకార్లు వినిపిస్తున్నాయ్.. దీనికి రెండు ఫోటోలను కారణంగా చూపిస్తున్నారు.

కృష్ణం రాజు.. ప్రభాస్ పెద్దనాన్న.. భారతీయ జనతా పార్టీలో వాజ్ పేయ్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉంది కూడా బిజెపి ప్రభుత్వమే. ఇప్పుడు కృష్ణం రాజు  తన పొలిటికల్ గ్రాఫ్ పెరగడానికి  ప్రభుత్వ పెద్దల కట్లో పడే ప్రయత్నం చేస్తున్నారట.. దానికి తన బాహుబలి ప్రభాస్ ను ఉపయోగించుకుంటున్నారని గుసగుసలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయ్…

prabhas

మొదట ప్రభాస్,కృష్ణం రాజు తన  ఫ్యామిలీ  తో కలిసి ప్రధానిని కలవడం, తర్వాత హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవడం దీనికి కారణాలుగా చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత BJP లో పెద్ద ర్యాంక్ ఉన్న నేతలు వారిద్దరే కావడం, వారిని ప్రభాస్ తో  డిల్లీ వెళ్లి మరీ కలవడం ఇదంతా అందులో భాగమే అనే విమర్శలు వస్తున్నాయ్.

prabhas with modi and rajnath

 

కానీ భాహుబలి సినిమా బాలీవుడ్ లో  కూడా రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టించడం, దేశీయ స్థాయి సినిమా ను ఇంటర్నేషనల్ రేంజ్ కి తీసుకెళ్లడంతో .. ప్రభాస్ ను కలవడానికి ఆ పెద్దలే మొగ్గుచూపారని మరో వాదన. ప్రభాస్ ను కలిసాక మోడీ  సైతం ఐ మేట్ బాహుబలి అని తన  సంతోషాన్ని ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top