ప్రేమకు అందంతో పనిలేదు అని మరోసారి నిరూపించాడు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు…

ప్రేమకు అందంతో పనిలేదు, మంచి మనసుంటే చాలు అని నిరూపించాడు ఒక వ్యక్తి. తనను ప్రేమించలేదు అని అమ్మాయి మొఖం మీద యాసిడ్ పోసాడు ఒక ఉన్మాది, పోరాడి మరి ప్రాణాలను నిలబెట్టుకుంది ఆమె, ఆ ఘటన తరువాత ఎన్నో కష్టాలను ఎదురుకొని, ఎన్నో పోరాటాలు చేసి అందరికి స్ఫూర్తిదాయకముగా నిలిచింది, ఆమెకు తోడుగా నిలిచిన వ్యక్తిని చివరికి ఆమె వివాహం చేసుకుంది. వివరాల్లోకెళితే..

ఢిల్లీ కి చెందిన లక్ష్మి పైన 2005లో ఒక వ్యక్తి యాసిడ్ పోసాడు, కారణం ఆమె అతని ప్రేమను అంగీకరించలేదు అని. శరీరంలో సగభాగం కాలిపోయింది, అయినా ఎక్కడ ధైర్యం కోల్పోకుండా చావుతో పోరాడి గెలిచారు లక్ష్మి. తరువాత ఎన్నో పోరాటాలు చేసి సుప్రీమ్ కోర్ట్ నుంచి యాసిడ్ అటాక్‌లపై కొత్త చట్టం వచ్చేలా చేశారు లక్ష్మి.

ఆ పోరాటాల్లోనే.. :

తనకు జరిగినట్టే ఇంకా చాలా మందికి జరిగిందని లక్ష్మి బాధ పడింది, వాళ్ళల్లో కొంత మందిని ఆమె కలిశారు, వారు ఈ పరిస్థితులని ఎలా ఎదురుకుంటున్నారో తెలుసుకున్నారు లక్ష్మి, విచ్చల విడిగా యాసిడ్ ని అమ్మకూడదు అని ఆమె పోరాటం చేసారు, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి ఆమె ఎన్నో పోరాటాలు చేసారు, ‘చాన్ వీ’ సంస్థని ప్రారంభించారు ఈ పోరాటాల కోసం. ‘చాన్ వీ’ సంస్థని ప్రారంభించాక అలోక్ దీక్షిత్ పరిచయమయ్యాడు.

ఆమెతో కలిసి.. :

లక్ష్మి తో కలిసి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాడు అలోక్ దీక్షిత్, ఒకరినినొకరు అర్ధం చేసుకున్న తీరు కానీ, ఒకరిమీద మరొకరికి ఉన్న నమ్మకం కానీ పెళ్ళికి దారి తీసింది, లక్ష్మి పైన యాసిడ్ పోసిన వ్యక్తి జైలు నుండి బయటకు వచ్చాక ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, అందుకు లక్ష్మి నిరాకరించింది. అలోక్ దీక్షిత్ ఏ ఆమెకు సరైన వాడు అని ఆమె భావించింది, ఆమె నమ్మకం ఒమ్ము కాలేదు, ఇద్దరు ఎంతో హాయిగా వారి జీవితాన్ని సాగిస్తున్నారు.

అలోక్ దీక్షిత్..:

అలోక్ దీక్షిత్ వైమానిక దళంలో పనిచేసేవాడు, అక్కడ రాజీనామా చేసి పాత్రికేయుడయ్యాడు. ఆ తరువాత లక్ష్మి లాంటి బాధితులకు అండగా నిలవడం కోసం ‘చాన్ వీ’ సంస్థ లో చేరి ఉద్యమించాడు, ఆ సంస్థ లో చేరాక లక్ష్మి ని చూసాడు అలోక్ దీక్షిత్. అలోక్ దీక్షిత్ మనసుకు లక్ష్మి నచ్చింది, అలోక్ దీక్షిత్ ఇంట్లో వాళ్ళు మొదట ఒప్పుకోలేదు, పద్ధతులు పట్టింపులు అని మాట్లాడారు, కానీ చివరికి వాళ్ళు ఒప్పుకున్నారు.

అలోక్ దీక్షిత్-లక్ష్మి లకు ఒక పాప, వీరు ముగ్గురు ఎంతో హ్యాపీ గా జీవితాన్ని గడుపుతున్నారు, యాసిడ్ దాడి తరువాత మొత్తం కోల్పోయ అని అనుకున్న లక్ష్మి, తరువాత ధైర్యం తో ముందుకు సాగింది, బంగారం లాంటి కుటుంబం ఆమె సొంతం, అమెరికా నుంచి అంతర్జాతీయ సాహస మహిళా పురస్కారం, ఓ ప్రఖ్యాత టీవీలో యాంకరింగ్ అవకాశం, షిరోస్ కెఫె ఏర్పాటు ఇలా చాలా రంగాల్లో రాణించారు లక్ష్మి.

 

Comments

comments

Share this post

scroll to top