థియేటర్ లో నా పక్క సీట్లో కూర్చున్న వారి రియాక్షన్! (Own Experience).

సండే కావడంతో రూమ్ మేట్స్  తో కలిసి సినిమాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న. ఇంతలోనే  ఏ సినిమాకు వెళ్లాలి? అనే చర్చ స్టార్ట్ అయ్యింది. వెంటనే మా ఫ్రెండ్ టీచర్ కావాలనుకున్న  ప్రతి ఒక్కరు మేము  సినిమా తప్పక చూడాలంట.! అని అన్నాడు…అప్పటికే  DSC వేటలో ఉన్న  మేము… మేము సినిమాకోసం పక్కనే ఉన్న BVK మల్టిఫ్లెక్స్ కు కదిలాం.! థియేటర్ దగ్గరే  కావడంతో ఓ 20 మినిట్స్ ముందే వెళ్లి అక్కడి క్యాంటీన్ దగ్గరున్న వెయిటింగ్ చైర్స్ లో కూర్చొని ఫోటోస్ దిగుతున్నాం.

మా చైర్ కు పక్కనే ఓ ఫ్యామిలీ కూర్చొని ఉంది. వాళ్ల అబ్బాయనుకుంటా…ఒకటే ఏడుస్తున్నాడు. ఐస్ క్రీమ్ కావాలని వాడి గొడవ. వద్దు బేటా… పండ్లు పాడయిపోతాయి అని వాళ్ల అమ్మ వర్షన్.! వాళ్ల నాన్న ఫోన్ లో ఏవో మెసేజ్ లను చూస్తు ఉన్నాడు. కాసేపటికి ఏడ్పు ఆపిన అబ్బాయి….అటు నుండి వెళుతున్న  మరో చిన్న అబ్బాయి చేతిలో ఉన్న బర్గర్ ను చూసి….మరో మారు తన ఏడ్పును స్టార్ట్ చేశాడు. ఈ సారి వాడి ఏడ్పు  బర్గర్ కోసం! అప్పుడు వాళ్ళ అమ్మ…పిల్లాడిని ఒక్కటి పీకింది. ఏది చూస్తే అది కావాలంటావ్… అవి తినకూడదు ఆయ్….!!  అవుతుంది అంటే కూడా వినవ్.  అంటూ చెంప మీద మరోమారు కొట్టింది. ఇప్పుడు కూడా వాళ్ల నాన్న ఇంకా…అదే ఫోన్ లో బిజీగా ఉన్నాడు.

టైమ్ అవ్వడంతో  థియేటర్ లోపలికి వెళ్లాం…. ఇంతకు ముందు నే చెప్పిన ఫ్యామిలీ వాళ్ల సీట్ నెంబర్  మా పక్కనే… ఆ పిల్లాడు నా పక్కనే కూర్చున్నాడు.  సినిమా స్టార్ట్ అయ్యింది. సినిమా అలా అలా నడుస్తూ ఉంది..సినిమాలో తల్లిదండ్రులు పిల్లలను ఎలా  పెంచాలని…సున్నితంగా చెబుతూ ఉన్నాడు….ఇంతలో ఓ భారీ సెంటిమెంట్ సీన్ వచ్చింది. అప్పుడు ఇంతకు ముందు ఆ కుర్రాడిని కొట్టిన అమ్మ ఈ సారి అతడిని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టింది.

20151022_Bollywood1_article_main_image

సినిమా మద్యలోనే వాళ్ల డాడీ  తన ఫోన్ ను స్విచ్చాఫ్ చేసి జేబులో పెట్టేశాడు. సినిమా చూస్తూనే వాళ్ల మమ్మీ కుర్రాడిని బయటికి తీసుకెళ్లి  ఓ ఐస్ క్రీమ్ ను కొనిచ్చి తీసుకువచ్చింది. మళ్లీ సినిమా చూస్తున్నారు ఆ ఫ్యామిలీ…ఈ సారి ఆ పిల్లాడు కుర్చీలో లేడు…వాళ్ల అమ్మ ఒడిలో ఉన్నాడు.  ఇంటర్వెల్ తర్వాత…సినిమాలో పాప పిచ్చుక కథ చెబుతుంటే తన కంటి వెంట కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ ఆ అమ్మ…తన ఒడిలోని పిల్లాడి నుదుటిపై ప్రేమగా అదే పనిగా ముద్దులు పెడుతుంది.

సినిమా అయిపోయింది…అందరం బయటికి వస్తున్నాం….. పిల్లాడితో తండ్రి…ఏరా నాన్న….మనం ఈ సండే అమ్మమ్మ వాళ్లింటికెల్దాం ఓకేనా అన్నాడు. హయ్…అమ్మమ్మ అంటూ సంతోషంగా గెంతులేశాడు పిల్లాడు. మళ్లీ పిల్లాడిని ముద్దు చేసింది తల్లి.

సినిమా అత్యంత  ప్రభావాన్ని చూసే సాధనం.. Hence Proved.

( ఈ స్టోరీని ఫీల్ అవ్వాలంటే… మేము సినిమా చూడాలి. స్టోరీ కోసం కాకపోయినా… పిల్లల్ని పెంచడం ఎలా అని తెలుసుకోడానికైనా ఈ సినిమా చూడాలి.)

 

Comments

comments

Share this post

scroll to top