బెంగ‌ళూరే బాద్‌షా – మెరిసిన కోహ్లి – ర‌ఫ్ఫాడించిన ర‌సెల్

ఐపీఎల్ టోర్నీలో వ‌రుస ఓట‌ముల నుండి నేర్చుకున్న గుణ‌పాఠం బాగా అచ్చొచ్చిన‌ట్టుంది కోహ్లికి. కోల్‌కతా నైట్ రైడ‌ర్స్‌తో హోరాహోరీగా జ‌రిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని సాధించింది. కెప్టెన్ కు కోపం వ‌చ్చిన‌ట్టుందేమో ..ఫోర్లు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగి పోయాడు విరాట్. మ‌రో వైపు కోల్‌క‌తా తానేమీ తీసిపోనంటూ ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు ర‌సెల్ ఆండ్రి, రాణా అద్భుతంగా రాణించారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. అనూహ్య‌మైన ప‌రిణామాలతో కోహ్లిసేన గెలుపొందింది. ఇంకో వైపు ఆలీ విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. మైదానంలో ఇరు జ‌ట్లు ప‌రుగులు సాధిస్తూ, వికెట్లు తీస్తూ అభిమానుల‌కు మంచి కిక్కు ఇచ్చారు. మ్యాచ్‌లో మొద‌టి 10 ఓవ‌ర్ల‌లో బెంగ‌ళూరు కేవ‌లం 70 ప‌రుగులు మాత్ర‌మే చేసింది.

ఒకానొక ద‌శ‌లో 150 ప‌రుగులు చేస్తుందో లేదోన‌ని ఆ జ‌ట్టు ఫ్యాన్స్ ఆందోళ‌న చెందారు. దానిని ప‌టాపంచ‌లు చేస్తూ గ్రౌండ్‌లోకి వ‌చ్చిన కోహ్లి సెంచ‌రీ కొట్టాడు. 213 ప‌రుగులు చేసింది. దీనిని ఛేదించేందుకు రంగంలోకి దిగిన కోల్ కోతా ఏ కోశాన ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు అవ‌కాశ‌మే ఇవ్వ‌లేదు. ఆఖ‌రు ఓవ‌ర్ వ‌ర‌కు పోరాడింది. ఊహించ‌ని రీతిలో నితీష్ రాణా, ఆండ్రి ర‌సెల్ చెల‌రేగి పోయారు. ఈడెన్ గార్డెన్స్ మైదానం చుట్టూ ప‌రుగులు సాధించారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌ను ఎడాపెడా బాదేశారు. ఆఖ‌రు వ‌ర‌కు కోల్‌క‌తా ఆట‌గాళ్లు రాణించ‌డంతో ఒక ద‌శ‌లో బెంగ‌ళూరుకు ఓట‌మి త‌ప్ప‌ద‌నిపించింది. కానీ ఆజ‌ట్టు బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. ఆలీ ఒక్క‌డే బౌలింగ్ లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చ‌డంతో కోల్‌క‌తా బోల్తా ప‌డింది. విరాట్ కోహ్లి కేవలం 58 బంతులు ఆడి 9 ఫోర్లు 4 సిక్స‌ర్లు సాధించి 100 ప‌రుగులు కొట్టారు.

కెప్ట‌న్‌గా కీల‌క పాత్ర పోషించాడు. జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపించారు. కోహ్లితో పాటు మెయిన్ ఆలీ కెప్టెన్‌కు తోడుగా నిలిచాడు. మొయిన్ ఆలీ 28 బంతులే ఆడి 5 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో దుమ్ము రేపాడు..66 ప‌రుగులు చేసి భారీ స్కోర్ పెరిగేందుకు దోహ‌ద‌ప‌డ్డారు. 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 213 ప‌రుగుల చేశారు. స‌రైన్ , ర‌సెల్ త‌క్కువ ప‌రుగులు ఇచ్చి ఒక్కో వికెట్ తీసుకున్నారు. టార్గెట్‌ను సాధించేందుకు రంగంలోకి దిగిన కోల్‌క‌తా 20 ఓవ‌ర్ల‌లో 203 మాత్ర‌మే చేసింది. రానా 46 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స‌ర్లతో 85 ప‌రుగులు చేశారు. ర‌సెల్ 2 ఫోర్లు, 9 సిక్స‌ర్ల‌తో 65 ప‌రుగులు చేసి చెల‌రేగి పోయారు. ఇంత‌టి విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడినా జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చ‌లేక పోయారు.

వీరిద్ద‌రు ఆటాడుతున్న స‌మ‌యంలో కోహ్లికి న‌మ్మ‌కం లేకుండా పోయింది. ఆఖ‌రు వ‌ర‌కు ఎంతో ఉత్కంఠ రేపింది ఈ మ్యాచ్. 12 ఓవ‌ర్ల‌లో 84 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. ఈ స‌మ‌యంలో వీరిద్ద‌రు రంగంలోకి దిగి ఆట తీరునే మార్చేశారు. ఆండ్రి ర‌సెల్ త‌న మార్క్‌తో రెచ్చిపోయాడు. 15వ ఓవ‌ర్ల‌లో హ్యాట్రిక్ సిక్స‌ర్లు బాదాడు. చివ‌రి ఓవ‌ర్‌లో 24 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో ఆలీ తొలి రెండు బంతుల‌కు ఒకే ప‌రుగు ఇచ్చాడు. మూడో బంతికి సిక్స‌ర్ వ‌చ్చింది. మిగ‌తా బంతుల‌ను ఆడ‌లేక పోవ‌డంతో ..గెలుపు దాకా వ‌చ్చిన కోల్‌క‌తా బోల్తా ప‌డింది. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో సెంచ‌రీ చేసి..జ‌ట్టు గెలుపున‌కు దోహ‌ద ప‌డ‌డంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కించుకున్నారు.

Comments

comments

Share this post

scroll to top