దుర‌దృష్టం వెంటాడింది..అదృష్టం వెన్ను త‌ట్టింది – ధోనీ శ్ర‌మ వృధా

దుర‌దృష్టం వెంట వుంటే..అదృష్టం ఎలా ద‌గ్గ‌రికి రాదో ధోనీని చూస్తే తెలుస్తుంది. స‌క్సెస్ ఫుల్ కెప్ట‌న్‌గా భార‌త జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు అందించిన ఘ‌న‌త ఈ క్రికెట‌ర్‌దే. ఐపీఎల్ -12 టోర్నీలో భాగంగా చెన్నై జ‌ట్టు ఆఖ‌ర్లో టార్గెట్‌ను ఛేజ్ చేయ‌లేక చేతులెత్తేసింది. దీంతో ఒక్క ప‌రుగు తేడాతో బెంగ‌ళూరు ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యం సాధించింది. గెలుపున‌కు అతి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి బెంగ‌ళూరు బౌల‌ర్ల మ్యాజిక్ దెబ్బ‌కు బోల్తా ప‌డింది. టోర్నీలో వ‌రుస విజ‌యాలు సాధిస్తూ టాప్ పొజిష‌న్‌లో వున్న చెన్నై జ‌ట్టు రెండో సారి ఓట‌మి పాలైంది. ఆశ‌లు ఆవిరై పోయిన స‌మ‌యంలో బెంగ‌ళూరుకు అదృష్టం వ‌రించింది.

ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రిత పోరులో బెంగ‌ళూరు అనూహ్య‌మైన విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఓడించిందిచెన్నై, బెంగ‌ళూరు క్రికెట్ అభిమానుల‌కు భ‌లే మ‌జా ల‌భించింది ఆట రూపంలో. ఇదీ మ్యాచ్ అంటే. ఇదీ క్రికెట్ అంటే. ధ‌నా ధ‌న్ ధోని దుమ్ము రేపాడు. మ‌రోసారి త‌న ప‌వ‌ర్ ఏమిటో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. టాస్ ఓడి కోహ్లి సేన ముందు బ్యాటింగ్‌కు దిగింది. పార్థివ్ ప‌టేల్ 37 బంతులు ఆడి రెండు ఫోర్లు, నాలుగు అద్భుత‌మైన సిక్స‌ర్లు ఆడ‌డంతో 53 ప‌రుగులు చేశాడు. ఏడు వికెట్లు కోల్పోయిన బెంగ‌ళూరు జ‌ట్టు 161 ప‌రుగులు చేసింది. చెన్నై జ‌ట్టులో చాహ‌ర్ 25 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జ‌డేజా 29 ప‌రుగులిచ్చి మ‌రో రెండు వికెట్లు తీశాడు. బెంగళూరు ప‌రుగులు ఎక్కువ‌గా చేయ‌కుండా క‌ట్ట‌డి చేశారు.

ఇక 161 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై జ‌ట్టును 29 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయ‌గా..ఉమేష్ 47 ప‌రుగులిచ్చి రెండు , సైని 24 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీసి..చెన్నైని ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేశారు. మైదానంలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ వ‌చ్చీ రాగానే ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. కేవ‌లం 48 బంతులు మాత్ర‌మే ఆడిన ధోని అయిదు ఫోర్లు ..ఏడు క‌ళ్లు చెదిరే సిక్స‌ర్ల‌ను కొట్టాడు. ఏకంగా 84 ప‌రుగులు చేశాడు. చెన్నైని దాదాపు గెలిపించినంత చేశాడు. చివ‌రి బంతికి ఒక్క ప‌రుగు రాక పోవ‌డంతో ఓట‌మి త‌ప్ప లేదు. ప్రారంభంలో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి 32 ప‌రుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టెయిన్, సైని, ఉమేష్ లు బంతుల‌తో క‌ట్ట‌డి చేశారు. చెన్నై బ్యాట్స్ మెన్స్ ను బెంబేలెత్తించారు.

స్టెయిన్ తొలి ఓవ‌ర్ లోనే వాట్స‌న్, రైనాల‌ను ఔట్ చేయ‌గా..డుప్లిసిస్ , జాద‌వ్‌ల‌ను ఉమేష్ వ‌రుస ఓవ‌ర్ల‌లో వెన‌క్కి పంపాడు. ఈ స‌మ‌యంలో ధోనీ, రాయుడులు మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. 29 ప‌రుగులు చేశాక రాయుడు పెవిలియ‌న్ బాట ప‌డ్డాడు. చాహ‌ల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. టార్గెట్ త‌క్కువ‌గానే ఉన్నా ప‌రుగులు చేయ‌లేక చ‌తికిల ప‌డింది చెన్నై జ‌ట్టు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో 26 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో ధోనీ చెల‌రేగి పోయాడు. ఉమేష్ బౌలింగ్‌లో రెచ్చి పోయాడు. బెంగ‌ళూరుకు చెమ‌ట‌లు ప‌ట్టించాడు. అయినా ఒకే ఒక్క ప‌రుగుతో ఓట‌మి ప‌ల‌క‌రించింది. అదృష్టం త‌లుపు త‌డితే ..బెంగ‌ళూరులా ఉంటుంది..దురదృష్టం వెంటాడితే అది ధోనీలాగా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top