ఇప్పుడున్న కష్టాలు సరిపోవన్నట్టు..200 రూపాయల నోట్ల అమలులో కేంద్రం మరో సంచలన నిర్ణయం..!

పాత 500 , 1000 నోట్లు బాన్ అయ్యాయి. కొత్త 500 , 2000 నోట్లు అమలులోకి వచ్చాయి. నోట్లు బాన్ అయిన రెండు నెలల పాటు 100 రూపాయల నోట్లు సరిగా దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పటికి కొత్త నోట్లు వచ్చినా, ఇంకా నోట్ల కొరత ఉంది అనే పేర్కొనాలి. అందుకే కొత్తగా రెండు వందల రూపాయల నోట్లను చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందట RBI.

జాతీయ పత్రిక ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. కేంద్రం ఆమోద ముద్రవేస్తే.. అతి త్వరలో నోట్ల ప్రింటింగ్ ను ప్రారంభిస్తామంటున్నారు RBI అధికారులు. జూన్ 2017 తరవాత నుండి వీటి ముద్రణ ప్రారంభం కావొచ్చట. మార్చి నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు అధికారులు.

అయితే ఈ కొత్త 200 రూపాయల నోట్లను కేవలం బ్యాంకులో మాత్రమే పొందవచ్చు అంట. ఎటిఎం లో ఇవి అందుబాటులో ఉండవు. ఇంతకముందు ఉన్న ఎటిఎం మెషిన్ లలో 1000 , 500 , 100 రూపాయల నోట్లు వచ్చేలా ప్రోగ్రాం చేసారు. కొత్త 2000 రూపాయల నోట్లు వచ్చిన తరవాత ఎటిఎం మచిన్స్ అన్నిటి ప్రోగ్రామ్ను మార్చి 1000 నోట్ల బదులు 2000 నోట్లు వచ్చేలా చేసారు. ఇప్పుడు కొత్తగా 200 నోట్లు అమలులోకి వస్తే మరోసారి ప్రోగ్రాం మార్చడం ఇబ్బంది అవుతుంది. అందుకే మెషిన్ మార్చకుండా 200 రూపాయల నోట్లను కేవలం బ్యాంకు బ్రాంచ్ లో మాత్రమే అందుబాటులో ఉంచేలా చేస్తున్నారు. ఇప్పుడు 10 , 20 , 50 రూపాయల నోట్లు కేవలం బ్యాంకు లోనే అందుబాటులో ఉన్నాయి. కొత్తగా 200 రూపాయల నోట్లు కూడా అదే జాబితాలోకి చేరనున్నాయి.

Comments

comments

Share this post

scroll to top