“టచ్ చేసి చూడు”తో రవితేజ మరోసారి హిట్ కొట్టాడా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): టచ్ చేసి చూడు

Cast & Crew:

  • నటీనటులు: రవితేజ, రాశి ఖన్నా, సీరత్ కపూర్ తదితరులు
  • సంగీతం: ప్రీతమ్
  • నిర్మాత:  నల్లమలపు బుజ్జి
  • దర్శకత్వం: విక్రమ్ శ్రీకొండ

Story:

కార్తికేయ (రవితేజ) ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. ఫ్యామిలీ కి చాలా విలువ ఇస్తుంటాడు. ఒకానొక టైములో పుష్ప(రాశి ఖన్నా) అనే అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. తన ఇంట్లో వాళ్ళను ఒపించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఇంతలో ఓ సమస్య వస్తుంది. కార్తికేయ ఒక పోలీస్ ఆఫీసర్ అని రెవీల్ అవుతుంది. అసలు కార్తికేయ పోలీస్ నుంచి కార్పొరేట్ కంపెనీ లో వర్క్ చేయాలిసిన అవసరం ఎందుకు వచ్చింది? కార్తికేయకు ప్రాబ్లెమ్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

Review:

ర‌వితేజ కెరీర్‌లో ప‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చేసిన సినిమాలు మంచి స‌క్సెస్ అయ్యాయి. ఇప్పుడు ర‌వితేజ కూడా ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్‌గా న‌టించిన ట‌చ్ చేసి చూడు సినిమాలో రాశీఖ‌న్నా, సీర‌త్‌క‌పూర్ హీరోయిన్లుగా న‌టించారు. విక్ర‌మ్ సిరికొండ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌వితేజ న‌ట‌న బాగుంది. రాశీఖ‌న్నా డ్యాన్స‌ర్‌గా, సీర‌త్‌క‌పూర్ ర‌వితేజ ఫ్యామిలీ ఫ్రెండ్‌గా న‌టించారు. ముర‌ళీశ‌ర్మ డీజీపీగా న‌టించాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు చూస్తే సినిమా డీసెంట్ గానే సాగింది. హీరోయిన్ల‌తో రెండు మూడు రొమాంటిక్ సీన్లు, మూడు సాంగ్స్ పిక్చ‌రైజేష‌న్ వ‌ర‌కు ఓకే. ప్లాట్ న‌రేష‌న్‌తోనే న‌డిచిన ఫ‌స్టాఫ్‌లో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఒక్క‌టే హైలెట్‌. ఇక్క‌డ వ‌చ్చిన ట్విస్ట్‌తోనే సెకండాఫ్‌పై అంచ‌నాలు పెరుగుతాయి. సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్‌లో ఏమీ లేద‌నుకుంటే దానికంటే కొంచెం బెట‌ర్ అంతే. ట‌చ్ చేసి చూడును యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చెప్పినా ద‌ర్శ‌కుడు ర‌వితేజ మార్క్ యాక్ష‌న్‌తో పాటు కామెడీ మిస్ చేసేశాడు. ఇక క‌థాప‌రంగా చూసినా బ‌ల‌హీన‌మైందే కావ‌డం ఈ సినిమాకు మ‌రో మేజ‌ర్ మైన‌స్ పాయింట్‌. సెకండాఫ్‌లో వ‌చ్చే కొన్ని ఫైట్లు మాత్రం యాక్ష‌న్ ప్రియుల‌ను మెప్పిస్తాయి. 147 నిమిషాల ర‌న్ టైం కూడా సినిమాలో చాలా సీన్ల స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది.

Plus Points:

సినిమా రెండు షేడ్స్ లో రవితేజ బాగా పెర్ఫర్మ్ చేసాడు
రాశిఖన్నా, సీరత్ కపూర్ వాళ్ళ పాత్రలకు తగట్టు బాగా నటించారు.
డైరక్షన్ విషయంలోకి వస్తే విక్రమ్ సిరికొండ కొత్త డైరెక్టర్ అయినా చాలా వరకు మెప్పించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది.
ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌

Minus Points:

కథ మొత్తం రొటీన్ గా ఉంది
సినిమా లో సాంగ్స్ మెప్పించలేకపోయాయ్
ఫస్ట్ ఆఫ్ కొంచం డ్రాగ్ చేసిన సెకండ్ ఆఫ్ ఒకే అనిపించేలా ఉంది.
ఎడిటింగ్‌

Final Verdict:

టచ్ చేసి చూడు అంతగా ఆడియన్స్ ను టచ్ చేయలేకపోయింది.

AP2TG Rating: 2.5 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top