రవితేజ డ్రగ్స్ కేసు, భరత్ ఆక్సిడెంట్ పై “సంచలన విషయాలు” బయటపెట్టిన “రవితేజ తల్లి”..! ఏమన్నారో తెలుసా?

డ్రగ్స్‌ కేసులో రవితేజ పేరు రావడం బాధాకరమని ఆయన తల్లి రాజ్యలక్ష్మి అన్నారు. భరత్‌ మరణం, రవితేజపై డ్రగ్స్‌ ఆరోపణలపై స్పందించేందుకు ఆమె సోమవారం మీడియా ముందుకు వచ్చారు. రవితేజకు ఎలాంటి దురలవాట్లు లేవని చెప్పారు. తన కొడుకు సిగరెట్‌ తాగడని, తాగేవాళ్లను ప్రోత్సహించడని ఆమె అన్నారు. రవితేజకు డ్రగ్స్‌ అలవాటు ఉందనడం అవాస్తమని, కావాలనే ఈ కేసులో అతడిని ఇరికిస్తున్నారని ఆరోపించారు.

భరత్‌ మద్యం మత్తులోనే రోడ్డుప్రమాదంలో చనిపోయాడనేది అవాస్తవమని రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. తమ కుటుంబ ఆచారం ప్రకారమే భరత్‌ అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు. చనిపోయే కొద్ది రోజుల ముందు భరత్‌ అన్ని దురలవాట్లు మానేశాడని వెల్లడించారు… బిగ్‌ బాస్‌ షోకు కూడా ఎంపికయ్యాడని.. ఆ ప్రయత్నంలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. భరత్‌ను దారిలో పెట్టేందుకు తాను రేయింబవళ్లు కనిపెట్టుకుని ఉండేదాన్నని ఆమె చెప్పారు. రవితేజ, భరత్‌ను ముడిపెట్టి చూడొద్దని విజ్ఞప్తి చేశారు. కుటుంబ ఆచారం ప్రకారమే భరత్‌ అంత్యక్రియలకు హాజరుకాలేదన్నారు. తన తమ్ముడు చనిపోయిన తర్వాత నిర్మాతలకు నష్టం రాకూడదనే రవితేజ షూటింగ్‌కు వెళ్లాడని చెప్పారు. భరత్‌ను రవితేజతో ముడిపెట్టి చూడొద్దని రాజ్యలక్ష్మి వేడుకున్నారు.

కాగా, డ్రగ్స్‌ కేసులో రవితేజకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ధ్రువీకరించలేదు.

Comments

comments

Share this post

scroll to top