కాంట్రోవర్సిగా మారుతున్న బెంగాల్ టైగర్ లోని రవితేజ డైలాగ్.!

రవితేజ. మాస్ ఎంటర్ టైనింగ్ సినిమాలకు, మాస్ డైలాగులకు పెట్టింది పేరు. డైరెక్టర్ అవుదామని క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో మనకందరికీ తెలిసిందే.  ఇండస్ట్రీలో ఎటువంటి గొడవలు కామ్ గోయింగ్ గాయ్ గా ఉంటూ వస్తున్నాడు ఇన్నిరోజులూ…. అయితే తన లేటెస్ట్ సినిమా బెంగాల్ టైగర్ లో కొన్ని డైలాగులతో చిక్కుల్లో పడ్డాడు తెలుస్తుంది రవితేజ.  తాజాగా బెంగాల్ టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మహారాజా. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో “నేను సపోర్ట్ తో పైకి వచ్చినోడ్ని కాదు, సోలోగా పైకొచ్చినోడ్ని ” అనే డైలాగు ఉంది. ఈ డైలాగు రవితేజ సినీ కెరియర్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని అంటున్నారు ఆయన అభిమానులు. అయితే సపోర్ట్ తో పైకొచ్చిన హీరోలు, వారసులుగా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలుగా అలరిస్తున్న ఇతర హీరోలను వేలెత్తిచూపేలా ఆ డైలాగ్ ఉందని ఇతర హీరోల అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top