రవితేజ బెంగాల్ టైగర్ రివ్యూ & రేటింగ్. రోటీన్ లో కాలేసిన రవితేజ!?

Cast & Crew:

  • నటీనటులు: రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బొమన్ ఇరానీ, షియాజీషిండే, పృథ్వీ
  • దర్శకత్వం: సంపత్ నంది
  • సంగీతం:భీమ్స్
  • నిర్మాత: కె. రాధా మోహన్

Story:

ఫేమస్ కావడానికి ఏమైనా చేసే కుర్రాడు ఆకాష్ నారాయణ్ (రవితేజ). గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఊర్లో అల్లరిచిల్లరిగా తిరుగుతుంటాడు. ఆకాష్ కు పెళ్లి చేయాలని ఆకాష్ కుటుంబ సభ్యులు అక్షతో పెళ్లిచూపులు అరేంజ్ చేస్తారు. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలని కండీషన్ పెడుతుంది అక్ష. ఫేమస్ కావడం కోసం హొమ్ మినిష్టర్  వద్ద, అతని కూతురు శ్రద్ధాని (రాశిఖన్నా)ని కాపాడే ఒప్పందం కుదుర్చుకుంటాడు ఆకాష్ నారాయణ్ . రౌడీల నుండి తనని కాపాడిన శ్రద్ధా ఆకాష్ ను ప్రేమిస్తుంది. ప్రేమ విషయం తన తండ్రితో చెప్పడంతో ఆకాష్ తో పెళ్ళికి ఒప్పుకుంటాడు హోమ్ మినిష్టర్. శ్రద్ధ-ఆకాష్ ల పెళ్లి సంగతిని శ్రద్ధ బర్త్ డే వేడుకలలో హోమ్ మినిష్టర్ అనౌన్స్ చేస్తుండగా, ఆకాష్ ఈ పెళ్లి చేసుకోనని..ఇదివరకే చీఫ్ మినిష్టర్ (బొమన్ ఇరానీ) కూతురు ( తమన్న)తో లవ్ లో ఉన్నానని షాక్ ఇస్తాడు.అక్కడే ఉన్న చీఫ్ మినిష్టర్ చంపుతానని ఆకాష్ కి వార్నింగ్ ఇస్తాడు. చెప్పిన టైంలోగా చంపకపోతే మీరా నిచ్చి పెళ్లి చేస్తానని చెబుతాడు.మాటతప్పిన సీఎం చివరికి ఆకాష్ కు డబ్బు ఆశ చూపుతాడు. ఇంతకు ముందే చీఫ్ మినిష్టర్ ను టార్గెట్ గా చేసుకొని ప్రతిసారీ అతడ్ని దెబ్బకొడుతుంటాడు ఆకాష్. చీఫ్ మినిష్టర్ కు, ఆకాష్ కు ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆకాష్,మీరా ఒకటయ్యారా? అనేది మిగిలిన కథ.

PLUS POINTS:

  • రవితేజ
  • హీరోయిన్స్ గ్లామర్
  • పృథ్వీ-రవితేజ కామెడీ సీన్స్

MINUS POINTS:

  • సెకండాఫ్
  • రొటీన్ స్టొరీ
  • ఎడిటింగ్

Verdict: రొటీన్ యాక్షన్ డ్రామా ఎంటర్ టైనర్.. బెంగాల్ టైగర్

Rating: 2.5 /5

Trailer:

Comments

comments

Share this post

scroll to top