అసలు విషయాలు బయటపెట్టిన “రవితేజ”..! ప్రెస్ మీట్ లో తమ్ముడి మరణంపై స్పందించి ఎలా ఫైర్ అయ్యారో తెలుసా..?

హీరో ర‌వితేజ సోద‌రుడు భరత్(52) హైద్రాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ మీద జ‌రిగిన ప్ర‌మాదంలో మృతిచెందారు. ఓ ఆర్ ఆర్ మీద త‌న కార్ లో అతివేగంగా ప్ర‌యాణిస్తున్న భ‌ర‌త్..ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు…దీంతో భ‌ర‌త్ అక్క‌డిక్క‌డే మృతిచెందారు.శంషాబాద్ లోని నోవాటెల్ నుంచి సిటికి వస్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమ‌ని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భ‌ర‌త్ పలు చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించారు.., ఒక్కడే, అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచెయ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించాడు. గతంలో పలు వివాదాల్లోనూ భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది.

అయితే అంతక్రియలకు రవితేజ కుటుంబం వెళ్ళకపోవడం, దహన సంస్కారాలు జూనియర్ ఆర్టిస్ట్ తో చేయించడం సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. తమ్ముడు చనిపోయిన తరవాత రోజే రవితేజ షూటింగ్ కి కూడా వెళ్లడంతో నెటిజెన్లు అందరు రవితేజ పై తిట్ల వర్షం కురిపించారు. ఇప్పటివరకు స్పందించని రవితేజ ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో ఈ వార్తలపై ఫైర్ అయ్యారు. అసలేం జరిగిందో చెప్పారు. ఆయన మాట్లాడుతూ

“జరగాల్సిన డ్యామేజ్‌ జరిగిపోయిందండీ. చెప్పడానికి ఏముంటుంది? అవతలివాళ్లు ఏ పొజిషన్‌లో ఉన్నారో కూడా ఆలోచించకుండా ఎంత మాట పడితే అంత మాట అనేయడం, ఏది పడితే అది రాసేయడం.. మీరే చెప్పండి ఎంత బాధగా ఉంటుందో? నేనందర్నీ అనడంలేదు. మా బాధలో మేం ఉంటే, సోషల్‌ మీడియాలో కొంతమంది ‘హిట్స్‌’ కోసం ఇంత రాద్ధాంతం చేస్తారనుకోలేదు. ఆలోచించకుండా నిందించారు. ఆ నిందలకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేను.”

కుటుంబం అంతక్రియలకు రాకపోవడానికి కారణం:

అంతే కాకుండా తన కుటుంబ పరిస్థితి గురించి ఇలా చెప్పారు..

“భరత్‌ యాక్సిడెంట్‌లో చనిపోయాడనే కబురు విని, ఇంటిల్లిపాదీ షాకయ్యాం. మా నాన్నగారి వయసు 85ఏళ్లు పైనే. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. ఈ వార్త విన్న తర్వాత అదోలా అయిపోయారు. కన్న కొడుకు చనిపోయాడని వింటే ఏ తల్లి మామూలుగా ఉంటుంది చెప్పండి. అమ్మ కుప్పకూలిపోయింది. నాన్న పరిస్థితి కొంచెం ఆందోళనగానే అనిపించింది. అమ్మను సముదాయించి, నాన్నను మామూలు స్థితికి తీసుకు రావడానికి ప్రయత్నించాం. ఈలోపు చిన్న తమ్ముడు రఘుని హాస్పిటల్‌కి వెళ్లి, మిగతా కార్యక్రమాలను చూడమన్నాం. భరత్‌ ముఖానికి బలమైన గాయాలు తగిలాయని తెలిసి, మేం వాణ్ణి అలా చూడకూడదనుకున్నాం. అందుకే వెళ్లలేదు. ఎంత బాధ ఉండి ఉంటుందో ఊహించండి. అమ్మానాన్న ఎప్పుడు మామూలు మనుషులవుతారో చెప్పలేను. మా ఇంటి పరిస్థితి అలా ఉంది.”

షూటింగ్ కి వెళ్ళడానికి కారణం:

“ఆర్టిస్ట్స్ అంతమంది డేట్స్‌ సెట్‌ చేసుకుని, షూటింగ్‌ చేయడం అంటే ఈజీ కాదు. అందరు డేట్స్ ఇచ్చారు. నా కారణంగా నిర్మాత నష్టపోవడం, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇబ్బందులపాలవ్వడం ఇష్టపడక షూటింగ్‌కి వెళ్లాను. తరవాత  మా అమ్మానాన్నల దగ్గరుండిపోయా. రఘు చేత అంతక్రియలు చేయించకూడదన్నారు. అందుకని మా బాబాయ్‌ (రవితేజ తల్లి సోదరి భర్త)తో అంత్యక్రియలు చేయించాం. ఆయనెవరో బయట జనానికి తెలియదు. కానీ, ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. భరత్‌ను అనాథలా పంపించామంటూ మమ్మల్ని అవమానించారు. మా గురించి సరే.. చనిపోయిన వ్యక్తి గురించి ఏదైనా కామెంట్‌ చేసేటప్పుడు కాస్త ఆలోచించాలి.”

చివరి చూపు చూడటానికి ఎందుకు వెళ్ళలేదు?

నాకున్న వీక్‌నెస్‌ అది. ఎమోషన్స్ ఎక్కువ. గాయాలతో ఉన్న తమ్ముడిని నేను చూడలేను. భయాలుంటాయి. అవేం తెలుసుకోకుండా నిందలు వేయడం బాధాకరం.

మీరందరు అన్నట్టు భరత్ మాకేం దూరంగా ఉండేవాడు కాదు. ఇటీవలే పుట్టిన రోజు వేడుకలు కూడా జరుపుకున్నాము. ఆ రోజు భరత్‌ బర్త్‌డే. కేక్‌ కట్‌ చేయడానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. ఆ రోజు మాత్రం ‘నేను కేక్‌ కట్‌ చేస్తా’ అని సందడి చేశాడు. నా ఇద్దరు పిల్లలు నన్ను పిలిచినట్లే నా తమ్ముళ్లను నాన్నా అని పిలుస్తారు. భరత్‌ చనిపోయాడని తెలిసి, పిల్లలు బాగా ఏడ్చారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top