“రవి శాస్త్రి” కోచ్ అవ్వాలంటే ఎలాంటి కండిషన్ పెట్టారో తెలుసా..? మరీ ఇలాంటి కండిషన్ పెడితే ఎలా..?

ఇటీవ‌లే లండ‌న్‌లో జ‌రిగిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ త‌రువాత భార‌త క్రికెట్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌త కొద్ది రోజులుగా కోచ్ కుంబ్లేకు, కెప్టెన్ కోహ్లికి మ‌ధ్య స‌త్సంబంధాలు లేవ‌ని మొద‌ట తెలిసింది. ఈ క్ర‌మంలోనే కొత్త కోచ్ కోసం బీసీసీఐ అన్వేషించ‌సాగింది. ఇక ట్రోఫీ ముగియగానే తాజాగా కుంబ్లే కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో కోహ్లి వ్య‌వ‌హ‌రించిన తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంత‌టి సీనియ‌ర్ ఆట‌గాన్ని లెక్క చేయ‌కుండా కోహ్లి ఇష్టం వ‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం, అందుకు బోర్డు పెద్ద‌లు వ‌త్తాసు పలకటం క్రికెట్ అభిమానుల‌కే న‌చ్చ‌డం లేదు. దీంతో చాలా మంది ఇప్పుడు కోహ్లిని విమ‌ర్శిస్తున్నారు. అయితే తాజాగా మ‌రో సంచ‌ల‌న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే…

బీసీసీఐ ప్రస్తుతం కొత్త కోచ్ కోసం వేటలో ఉందని తెలిసిందే. దరఖాస్తులు సవీకరిస్తుంది. ఇప్పటికే టామ్‌ మూడి, సెహ్వాగ్‌ వంటి వారు రేసులో ఉండగా.. కొత్తగా మరిన్ని దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఇందులో ఇండియా టీమ్‌ మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి పేరు కూడా ఉంది. కానీ కోచ్ అవ్వాలంటే ఆయన ఓ కండిషన్ పెట్టారు. అదేంటి అంటే…“కోచ్‌ బాధ్యతలు అప్పగించాలనుకుంటే అప్పగించండి. నేను మాత్రం ఇంటర్వ్యూ కోసం వరుసలో నిలబడను’’ అని రవిశాస్త్రి అంటున్నాడు.

ఎందుకంటే ఇంటర్వ్యూ కి వచ్చి అతన్ని తీసుకోకుంటే ఆయనకు నచ్చదు అంట. అది అవమానంలా భావిస్తారంట. కిందటిసారి రవిశాస్త్రి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినప్పుడు అతడికి, గంగూలీ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి ఏమవుతుందో వేచి చూడాలి!

Comments

comments

Share this post

scroll to top