“రవి శాస్త్రి” కోచ్ అయ్యింది ఇలానే..? ఇష్టంలేకపోయినా “గంగూలీ” ఒప్పుకుంది ఎందుకో తెలుసా..? కండిషన్ ఇదే.!

మొత్తం మీద భారత క్రికెట్ జట్టు కోచ్ ఎవరు అనే సస్పెన్స్ కి తెర పడింది. మంగళవారం రాత్రి రసవత్తర హైడ్రామా నడుమ కోచ్ ఎంపిక జరిగిన విషయం తెలిసిందే. వీరేంద్ర సెహ్వాగ్, రవిశాస్త్రిల మధ్య కోచ్ పదవికోసం తీవ్ర పోటీ నెలకొన్నట్టు సమాచారం. టీమిండియా మాజీ కెప్టెన్, క్రెకెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరబ్ గంగూలికి రవిశాస్త్రి ఎంపిక అస్సలు ఇష్టం లేదని చెబుతున్నారు. గతంలో కోచ్ పదవి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడం సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. మరి ఇప్పుడు భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రిని ఎంపిక చేయడం సీఏసీ సభ్యుడు సౌరబ్ గంగూలీకి ఇష్టం లేదా? మిగతా సభ్యుల ఒత్తిడి మేరకు అయిష్టంగానే ఒప్పుకున్నాడా? వివరాలు మీరే చూడండి!
 టీమిండియా మాజీ కెప్టెన్, క్రెకెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరబ్ గంగూలికి రవిశాస్త్రి ఎంపిక అస్సలు ఇష్టం లేదని చెబుతున్నారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ గట్టిగా పట్టుబట్టడంతో రవిశాస్త్రికి మార్గం సుగమమైనట్టు సమాచారం. సీఏసీ సభ్యులైన సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు మంగళవారం రాత్రి కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాన్ఫరెన్స్ కాల్ చేసినప్పుడు అతడు శాస్త్రికే గట్టి మద్దతు తెలిపినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

రవిశాస్త్రిని కోచ్ చేస్తే జట్టుకి మేలు జరుగుతుంది అని “సచిన్” గంగూలీకి నచ్చచెప్పాడు. కుంబ్లేతో గొడవ తరవాత రవి శాస్త్రి కోచ్ అయితే బాగుండు అని కోహ్లీ కూడా మొగ్గుచూపారు. కానీ గంగూలీ మాత్రం ఓ షరతు పెట్టారు. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ కావాలని రవిశాస్త్రి ప్రతిపాదించగా… గంగూలీ మాత్రం జహీర్ ఖాన్ పేరు తెరపైకి తెచ్చినట్టు సమాచారం. ‘‘జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా అంగీకరించిన తర్వాతే రవిశాస్త్రిని కోచ్‌గా ఎన్నుకునేందుకు గంగూలీ ఒప్పుకున్నాడు…’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Comments

comments

Share this post

scroll to top