మనవాళ్లు రావిచెట్టుకు, తులసి చెట్టుకు పూజలెందుకు చేస్తారో తెలుసా? సాంప్రదాయం వెనకున్న సైన్స్.

హిందూ సాంప్రదాయం ప్రకారం రావిచెట్టుకు పూజలు చేయడం సాధారణ విషయమే, ఇక తులసి చెట్టుకు చేసే పూజ గురించైతే స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండడం మనం గమనిస్తున్న విషయమే…..అయితే లోకంలో ఇన్ని చెట్లుండగా ఈ రెండు చెట్లకే మన వాళ్లు పూజలెందుకు చేస్తారు అనే డౌట్ మీకు వచ్చిందా..? పురాణాల ప్రకారం ఎన్నో కథలు చెబుతారు కానీ పురాణాలను పక్కకు పెట్టి వాటినే ఎందుకు పూజిస్తారో సైన్స్ పరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఒక విషయం మాత్రం సింపుల్ మనకు మేలు చేసే వారిని,  కాస్తంత విశిష్టత కలిగిన దానిని మనం ఆరాధించడంలో ఎటువంటి తప్పులేదు…. ఈ పాయింట్ ను గుర్తు పెట్టుకోండి.

రావిచెట్టుకు ఎందుకు పూజచేస్తారు?

రావిచెట్టుకు పూజెందుకు చేయాలి…అది ఇచ్చే పండ్లు తినడానికి కూడా పనికి రావు అలాగని రావి కలప  కూడా ఎందుకు పనికి రాదు అలాంటప్పుడు దీనికెందుకు పూజలు..అని అడిగితే సమాధానం..” సహజంగా చెట్లన్నీ కిరణజన్యసంయోగ క్రియలో భాగంగా సూర్యుడున్నప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి..అదే సూర్యుడి లేని టైమ్ లో అంటే రాత్రి పూట మనుషుల లాగే ఆక్సిజన్ ను తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయి.. కానీ రావిచెట్టు అలా కాదు, రాత్రి పూట కూడా ఆక్సిజన్ ను విడుదలచేసే ఏకైక చెట్టు రావి చెట్టు.  జీవకోటికి అవసరమైన ప్రాణవాయువును అందిస్తున్న  రావిచెట్టును నరికివేయకుండా పూజలు చేస్తారు.

peepal-tree-leaves

తులసి చెట్టును ఎందుకు పూజిస్తారు?

ఆయుర్వేదం ప్రాచీన వైద్యశాస్త్రం. అంతులేని రోగాలను సైతం అంతం చేసిన ఘన చరిత్ర దానికుంది.. తులసి చెట్టులో ఉన్నటువంటి గొప్ప గుణాలు, గొప్ప ఔషధాలు మరే చెట్టులోనూ లేవు. ఉదయం తాగే టీలో ఒక్క తులసి ఆకును వేసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంటి ఆవరణలో తులసి చెట్టు ఉండటం వలన ఎటువంటి క్రిమికీటకాలు, దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.  ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే….. ఆక్సిజన్ ను తీసుకొని ఆక్సిజన్ ను ఇచ్చే ఏకైక చెట్టు తులసి.

3070456894_e6d700b2da_b (1)

అదన్నమాట సంగతి…. సొంత విశిష్టతను కలిగి ఉండండం…..మానవజాతి మనుగడకు ఉపయోగపడుతుండడం చేత రావిచెట్టును తులసి మొక్కను దైవ సమానంగా పూజిస్తారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరూ దేవుడితో సమానం అయితే ఈ రెండు చెట్లు కూడా అంతే.!

Comments

comments

Share this post

scroll to top