అందానికి అర్ధం ఆ అమ్మాయి అనుకున్నాడు..! చివరికి కథగానే మిగిలింది అతని ప్రేమ..! అసలేమైంది?

“డిక్షనరీ గనుక నేనే కనిపెట్టుంటే…అందానికి అర్ధం వచ్చే ప్రతి పదానికి నీ పేరే పెట్టేవాడిని”…ఇదేంటి సడన్ గా లవ్ కోట్ రాస్తున్నాను అని అనుకుంటున్నారా..? ఇది నా డైలాగ్ కాదు “యాంకర్ రవి” కొట్టిన డైలాగ్…పటాస్ షోలో శ్రీముఖితో అన్నాడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే..! మరింకెవరితో చెప్పాడు? పెళ్లి చేసుకోబోతున్నాడా? అనుకుంటున్నారా.? అదేం లేదండి యాంకర్ రవి హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం “ఇది నా ప్రేమ కథ” సినిమాలో డైలాగ్ అది. ఆ ప్రేమ కథ కథ గానే మిగిలిపోయింది అంట మరి. చివరికి ఇద్దరు కలిసారా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..! ఈలోపు ఓసారి టీజర్ లుక్ వేసుకోండి!

watch video here:

పీ.ఎల్.కె రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంగీతం అందించింది కార్తీక్ కొడకండ్ల. ఇంత చెప్తున్నాను కానీ అసలు మేటర్ చెప్పనే లేదు. ఇంతకీ మన హీరో ప్రేమించిన అమ్మాయి ఎవరు?. మరెవరో కాదు సీరియల్ హీరోయిన్ గా ఎంతో మంది కుర్రకారుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ “మేఘన లోకేష్”. మరి తెర మీద రవి, మేఘన లోకేష్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి!

watch video here:

ఈ చిత్రంలోని పాటలు కూడా సంగీత ప్రియుల మనసు దోచుకునేలా ఉన్నాయి. ప్రేమలో పాడిన వారైతే ప్రేమించిన అమ్మాయిని ఊహించుకొని పాడేసుకుంటారు. ప్రేమలో పడని వారు వెంటనే ప్రేమలో పడిపోవాలి అనుకుంటారు..! ఇందులో అతిశయోక్తి ఏం లేదు…అందం దాగిన ప్రాణం ఉందని తెలియలేదు, ఫీల్ మై లవ్ అనే టైటిల్ తో ఉన్న ఈ చిత్రంలో ఉన్న రెండు పాటలు వింటే ఆ మాట మీరే అంటారు..!

watch video here:

Comments

comments

Share this post

scroll to top