రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై ఆందోళనకారుల విధ్వంసం వీడియో.! ప్రయాణికుడు తన ఫోన్ లో తీసాడు.

రెండు రోజుల క్రితం ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే…దానికి సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.  వెళుతున్న రైలును ఆపి, చేతికి దొరికిన వాటితో రైలు అద్దాలు పగులగొట్టడమే కాకుండా ట్రైన్ కు నిప్పంటిచారు ఆందోళనకారులు.. ఆందోళనకారులు  ట్రైన్ పై దాడి చేస్తుండగా ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు దీన్నంతా తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాడు…. ఇందులో అల్లరిమూక ట్రైన్ అద్దాలు పగులగొడుతున్న దృశ్యాలు, అద్దాలు పగిలిన శబ్దాలు రికార్డ్ అయ్యాయి, ఈ దాడి జరుగుతున్నంత సేపు ప్రయాణికులు భయంభయంగా గడిపారు. దిగితే ఏం జరుగుతుందోనని ట్రైన్ దిగకుండా చాలా సేపు అలాగే డోర్లు బిగించుకొని ఉన్నారు.

ఆ ప్రయాణికుల్లో ఒకతను పోలీస్ అధికారులకు దాడికి సంబంధించిన సమాచారాన్ని ఫోన్ లో తెలియజేశాడు. మరికొద్ది సేపటికే ట్రైన్ వెనుకభాగం నుండి పెద్ద ఎత్తున పొగలు రావడం. ఆ తర్వాతే మంటలు వ్యాపించడంతో ప్రాణభయంతో ప్రయాణికులందరూ ట్రైన్ దిగారు.

కుల రిజర్వేషన్ కోసం జాతి సంపదను తగులబెట్టడం,  ప్రయాణికులను భయోత్పాతానికి గురించేయడం ఎంత వరకు సబబో ఓ సారి ఆలోచించండి. ఉద్యమం ఏదైనా శాంతి యుతంగా, ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలే కానీ, మనవాళ్ళని మనం ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు.

Watch Video: ( Wait 3 Sec For Video To Load)

ఆందోళన కారులు నిప్పు పెట్టిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ లోని ప్రయాణికులు తీసిన వీడియో.

Posted by బతుకమ్మ on Tuesday, February 2, 2016

Comments

comments

Share this post

scroll to top