రాశి చ‌క్రం ప్ర‌కారం ఈ 12 రాశుల వారికి ఏయే వీక్ నెస్ పాయింట్స్ ఉంటాయో తెలుసా..? మీ రాశి ఏంటి.?

ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి ఒక వ్యక్తికి ఏదో ఒక విష‌యంలో వీక్‌నెస్‌, వీక్‌పాయింట్ ఉంటుంది. దాని గురించి ఎవ‌రైనా ఇత‌రుల‌కు చెప్ప‌రు. ఎందుకంటే ఇత‌రుల‌కు మ‌న వీక్ పాయింట్ తెలిస్తే వారు మ‌న‌ల్ని ఏమైనా చేయ‌వ‌చ్చు. మ‌న‌కు అనేక విధాలుగా న‌ష్టం క‌ల‌గ‌వ‌చ్చు. క‌నుక ఎవ‌రూ కూడా త‌మ వీక్ పాయింట్ల‌ను ఇత‌రుల‌కు చెప్ప‌రు. అయితే ఎవ‌రికైనా త‌మ త‌మ రాశుల ప్ర‌కారం ప‌లు కామ‌న్‌ వీక్ పాయింట్లు, వీక్‌నెస్‌లు ఉంటాయ‌ట‌. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మేషం : మార్చి 21-ఏప్రిల్ 19
వీరు త‌మ చుట్టూ జరిగే చాలా విషయాలను గ‌మనిస్తుంటారు. వాటిపై కంట్రోల్ సాధించాల‌ని కోరుకుంటారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీరు త‌మ పక్కన ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తారు. ఫలితంగా ఇబ్బందుల్లో పడతారు. ఇదే ఈ రాశి వారి వీక్ నెస్‌, వీక్ పాయింట్‌.

2. వృషభం : ఏప్రిల్ 20-మే 20
వృషభరాశి వారు చాలా నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే వీరు చాలా స్థిరంగా ఉండే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే వీరు అపజయాలు వస్తాయని ఎక్కువగా భయపడుతుంటారు. ఇది వీరి వీక్‌నెస్‌. కానీ గెలుపైనా, ఓటమైనా ఏదైనా సరే అని ముందుకు వెళ్తే వీరికి తిరుగుండ‌దు.

3. మిథునం : మే 21- జూన్ 20
వీరికి ఒక అంశంపై స్థిర‌మైన ఆలోచ‌న ఉండ‌దు. నిమిషానికి ఒక ఆలోచ‌న వ‌స్తుంటుంది. ఉద్యోగం, హాబీలు, ఇత‌ర ఏ విష‌యం అయినా స‌రే అనేక మార్లు ఆలోచిస్తారు. దాంతో ఇబ్బందులు ప‌డుతారు. ఇది వీరి వీక్‌నెస్‌.

4. కర్కాటకరాశి : జూన్ 21- జూలై 22
ఈ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఒక్కోసారి ఎమోషన్స్‌ను అలాగే ఉంచుకుంటారు. వాటిని ఎప్పుడో ఒక‌సారి అక‌స్మాత్తుగా బయటపెడతారు. అవతలి వ్యక్తులు చిన్న మాట అన్నా కూడా వీరి మనోభావాలు దెబ్బతింటాయి. దీంతో వీరు ఎక్కువగా ఆందోళనకు గురై హ‌ర్ట్ అవుతారు. దాంతో నిరాశ చెందుతారు. వీరు ఎక్కువగా నిరాశాజనకంగా ఉంటారు. ఏ విషయంపై కూడా అంత‌గా ఆస‌క్తి చూప‌రు. వీరికి ఇత‌రుల‌పై అస్స‌లు న‌మ్మ‌కం ఉండ‌దు. ఇవన్నీ వీరి వీక్ నెస్ పాయింట్లు.

5. సింహరాశి : జూలై 23-ఆగస్టు 23
సింహరాశి వారికి కాస్త గర్వం, అహంకారం ఎక్కువగా ఉంటుంది. వీరు పక్కవారి పట్ల కూడా కాస్త గర్వంగా ఉంటారు. ఇదే వీరి వీక్‌నెస్‌. దీంతో వీరికి చాలామంది దూర‌మ‌వుతారు. వీరు ఈగోను విడిచిపెడితే హ్యాపీగా ఉండ‌వ‌చ్చు.

6. కన్యరాశి : ఆగస్టు 24-సెప్టెంబర్ 23
కన్యరాశి వారికి మేథ‌స్సు బాగా ఉంటుంది. వీరు దేనిపైనైనా విశ్లేషణ చేయగలుగుతారు. ఇదే వీరి బలం.. బలహీనత. ప్రతి సమస్యను తాము పరిష్కరించగలుగుతామనే ధీమాతో వీరు ఉంటారు. కానీ చివ‌ర‌కు త‌మ స‌మ‌స్య‌ను తామే ప‌రిష్క‌రించుకోలేని అయోమ‌య స్థితిలో ప‌డ‌తారు. ఇది కూడా వీరి వీక్‌నెసే.

7. తుల : సెప్టెంబర్ 24 అక్టోబర్ 23
ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. శాంతి కాముకులుగా ప్ర‌వ‌ర్తిస్తారు. కానీ వీరికి షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్నట్లుండి అప్ప‌టిక‌ప్పుడే కోపం వస్తుంది. దీంతో సహనాన్ని కోల్పోతారు. అందరినీ దూరం చేసుకుంటారు. ఇది వీరి వీక్‌నెస్ పాయింట్‌.

8. వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22
ఈ రాశి వారు ఎక్కువ రొమాంటిక్ గా ఉంటారు. వీరు శృంగార సంబంధాలు కూడా బాగా కలిగి ఉంటారు. దీని వల్ల వీరు చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడుతుంటారు. ఇది వీరి వీక్ నెస్ పాయింట్‌.

9. ధనస్సురాశి : నవంబర్ 23 -డిసెంబర్ 22
ఈ రాశి వారు ఎప్పుడూ బోర్ గా ఫీలవుతుంటారు. వీరికి ఎక్కువగా ఓపిక, సహనం అస‌లే ఉండదు. వీరు ఎదుటివారు చెప్పేది అస్సలు వినరు. దీంతో వీరు చాలామందిని దూరం చేసుకుంటూ ఉంటారు. వీరి వీక్‌నెస్ ఇదే.

10. మకరం : డిసెంబర్ 23- జనవరి 20
ఈ రాశి వారు డబ్బుకే ఎక్కువ విలువ‌నిస్తారు. డబ్బు సంపాదించడం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. దీంతో వీరు చిన్నచిన్న సరదాలను కూడా కోల్పొతుంటారు. అలాగే వీరు చిన్నపని చేసి దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. తమదే విజయం అని అనుకుంటారు. ఇది వీరి వీక్‌నెస్‌.

11. కుంభం : జనవరి 21- ఫిబ్రవరి 18
ఈ రాశి వారు త‌మ‌ మనస్సులోని విషయాలను బయపెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. వీరికి చాలా భావోద్వేగాలుంటాయి. కానీ వాటిని వ్యక్తపరచలేరు. ఎదుటి వారు ఏమ‌నుకుంటారోన‌న్న భ‌యం వీరిలో ఉంటుంది. ఇది వీరి వీక్‌నెస్‌.

12. మీనం : ఫిబ్రవరి 19-మార్చి 20
మీనరాశి వారికి కూడా భావోద్వేగాలు ఎక్కువగానే ఉంటాయి. అయితే వాటిని వీరు వ్యక్తపరుస్తారు. వీరిలో సృజనాత్మక ఎక్కువగా ఉంటుంది, కానీ దాన్ని వెలికితీయడంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇదే వీరి వీక్‌నెస్ పాయింట్‌.

Comments

comments

Share this post

scroll to top