సాయి పల్లవి పంట పండించిన మహేష్ బాబు…అసలు వీళ్ళిద్దరికి ఎలా కుదిరిందీ??

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా లో నటిస్తున్నాడు, మహర్షి సినిమా తరువాత అనిల్ రావిపూడి తో సినిమా తియ్యనున్నాడని వార్తలు వస్తున్నాయి, అయితే ఈ సినిమా లో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేదాని పైన రోజుకో పేరు వినిపిస్తుంది, కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రష్మిక లేదా సాయి పల్లవి నటించనున్నారట.

ఇద్దరిలో ఒకరా.? ఇద్దరా.?

నిన్నటి వరకు సాయి పల్లవి పేరు బాగా వినిపించింది, మహేష్ బాబు సరసన సాయి పల్లవి అనే సరికి అందరిలోనూ ఆసక్తి పెరిగింది, అయితే ఇవ్వాళ కొత్తగా రష్మిక మందన పేరు వినిపిస్తుంది, వీరిరువురిలో ఒకరు మహేష్ సరసన నటించనున్నారా.? లేక వీరిలో ఎవరో ఒకరు మహేష్ సరసన నటించనున్నారా అనేది అధికారిక ప్రకటన తరువాతే చెప్పగలం. వీరిరువురిలో ఏ ఒక్కరు మహేష్ బాబు సరసన నటించినా వారి కెరీర్ కి మంచి బూస్ట్ లభించడం ఖాయం, స్టార్ హీరో ల లీగ్ లోకి ఎంటర్ అయినట్టే ఈ భామలు.

అనిల్ చేసే మాయ.. :

పటాస్ సినిమా తో కళ్యాణ్ రామ్ కి లైఫ్ సేవింగ్ హిట్ ఇవ్వడమే కాకుండా ఫుల్ ఫేమస్ అయ్యాడు అనిల్ రావిపూడి, ఆ తరువాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ తీసాడు, ఆ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రం గా నిలిచిపోయింది, చిన్నగా స్టార్ హీరో ల వైపు అడుగు వేసాడు, రవి తేజ తో తీసిన రాజా ది గ్రేట్, వెంకటేష్ తో తీసిన F2 సినిమాలతో తన సత్తా చాటుకున్నాడు. ఫ్యాన్స్ నే కాదు ఫ్యామిలీస్ ని కూడా ఆకట్టుకున్నాడు ఈ రెండు సినిమాలతో, ఇప్పుడు మహేష్ బాబు తో తియ్యనున్న సినిమా కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ ఏ అని సమాచారం.

సంక్రాంతి కి ఫిక్స్.. :

వచ్చే ఏడాది సంక్రాంతి కి మహేష్ బాబు అనిల్ రావిపూడి చిత్రాన్ని విడుదల చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, అనిల్ సుంకర మహేష్ బాబు 26 వ చిత్రానికి ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు. అనిల్ రావిపూడి చిత్రం తో మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడతాడో లేదో వేచి చూడాలి, మహర్షి చిత్రం ఏప్రిల్ 25 న విడుదల కానుంది.

 

Comments

comments

Share this post

scroll to top