జబర్థస్త్ ఫేమ్ రష్మీ నటించిన గుంటూర్ టాకీస్…రివ్యూ & రేటింగ్స్.

Poster:
 Guntur-Talkies-Movie-Poster-4
Cast & Crew:
నటీనటులు: సిద్ధు, నరేష్, రేష్మి, శ్రద్ధాదాస్, మహేష్ మంజ్రేకర్
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
సంగీతం: శ్రీ చరణ్ పాకల
నిర్మాత : రాజ్ కుమార్ . ఎం
Story: 
గుంటూరులోని గుంటూరు టాకీస్ మెడికల్ షాపులో హరి (సిద్ధూ),గిరి (నరేష్) పనిచేస్తూ ఉంటారు. చాలీచాలని జీతాలతో బ్రతుకునీడుస్తున్న ఈ ఇద్దరూ రాత్రి సమయాలలో దొంగతనాలు చేస్తూ ఉంటారు. హరి పక్కింటి సువర్ణ (రేష్మి)తో రహస్య ప్రేమ వ్యవహారం నడుపుతూ ఉంటాడు. ఒకరోజు దొంగతనానికి వెళ్ళిన హరికి ఒక ఇంట్లో రూ.5 లక్షలు డబ్బు దొరుకుతుంది. అదే విధంగా గిరికి రూ. 5 లక్షలు డబ్బు దొరుకుతుంది. అయితే ఈ విషయం హరి గిరి ఒకరికొకరు చెప్పుకోరు. హరి తన ప్రేయసి సువర్ణతో ఎంజాయ్ చేయడానికి   గోవా  బయల్దేరతాడు. గిరి కూడా ఆ డబ్బులతోనే బాగానే ఎంజాయ్ చేస్తుంటాడు. గోవా వెళ్ళిన హరిని కొందరు రౌడీలు (మహేష్ మంజ్రేకర్), రివాల్వర్ రాణి (శ్రద్ధాదాస్)అక్కడ బంధిస్తారు. ఇక అంతకుముందే గిరిని తీసుకువచ్చి తమ దగ్గరే చేసుకొని ఉంటారు. హరి, గిరిలు దొంగతనం చేసిన డబ్బు సీఐ రఘుబాబుది. వారు దొంగతనం చేసిన ఇల్లులు రెండూ రఘుబాబువి. అలా దొంగతనం చేసినందుకు తమ ఇద్దరినీ ఇలా బంధించారని వారిద్దరూ అనుకుంటుండగా అసలు ట్విస్ట్ విని షాక్ అవుతారు. కోటి రూపాయల విలువ చేసే ఒక బాక్సును ఎక్కడ దాచిపెట్టారో కనుక్కోవడానికి వారిద్దరినీ బంధించి ఉంటారు ఆ రౌడీల బ్యాచ్. మరోవైపు దొంగతనం చేసినందుకు పోలీసులు వారిద్దరినీ పట్టుకోవడానికి వెదుకుతూ ఉంటారు. ఇంతకీ కోటి రూపాయల బాక్స్ కథ ఏంటి? చివరకు హరి, గిరి రౌడీలు, పోలీసుల నుండి బయటపడ్డారా? అనేది మిగిలిన కథ.
 
PLUS POINTS:
  • సిద్ధూ, నరేష్ నటన
  • రేష్మి, శ్రద్ధాదాస్ గ్లామర్ షో
  • సెకండాఫ్
  • అడల్ట్ కామెడీ 
MINUS POINTS:
  • ఫస్ట్ హాఫ్
  • కథ, కథనం
  • క్లైమాక్స్
 Verdict: సో సో.. టాకీస్
Rating:  2.5 /5
Trailer:

Comments

comments

Share this post

scroll to top