మగవాళ్ల వస్త్రధారణ పైన సంచలనమైన కామెంట్స్ చేసిన రష్మీ, చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాది అంటున్న రష్మీ..!

ఇటీవల బాలసుబ్రమణ్యం గారు ఆడవాళ్ళ వస్త్రధారణ పైన చేసిన కామెంట్స్ సినిమా ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యాయి, ఆయన కామెంట్ కి నాగబాబు కౌంటర్ ఇవ్వడం తో చిచ్చు బాగా రగులుకుంది, ఆ చిచ్చు లో రష్మీ కూడా ఒక పుల్ల వేసింది, మగవాళ్ల వస్త్రధారణ పైన కామెంట్స్ చేసింది రష్మీ. “మగవాళ్లు షార్ట్స్ వేసుకుంటున్నారు, వారి కాళ్లపై జుట్టు అలాగే అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది, జబ్బలు కనిపించేలా కట్ బనియన్లు వేసుకుంటున్నారు. మరికొంత మంది షర్ట్ వేసుకోకుండా ఛాతి కనిపించేలా ఎక్స్‌పోజ్ చేస్తున్నారు, ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి” అని రష్మీ తెలిపింది.

రష్మీ ఎందుకలా.. :

రష్మీ ఫ్యాన్స్ మాత్రం రష్మీ మాట్లాడిన మాటలకు, ఎందుకు రష్మీ అనవసరంగా అని ట్వీట్స్ వేస్తున్నారు, ఆమెను కొందరు కామెంట్ చేస్తున్నా, ఆమె ఫ్యాన్స్ ఆమెను డిఫెండ్ చేస్తున్నారు, రష్మీ ఇలాంటి విషయాల్లో ధైర్యంగా నిలబడటం ఇది మొదటి సారి కాదు, ఇది వరకు కూడా చాలా సార్లు రష్మీ ఇలాంటి సిట్యుయేషన్స్ ని ఫేస్ చేసింది, సో తనకు ఏ సమయం లో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు అని రష్మీ ఫ్యాన్స్ మరికొందరు ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు, మొత్తానికి రష్మీ V/S బాలసుబ్రమణ్యం గారు వయ నాగబాబు లాగ మారింది కథ. దీనికి ఎవరు ముగింపు పలుకుతారో వేచి చూడాలి.

అసలు బాలసుబ్రమణ్యం గారు ఏమన్నారు అంటే..

బాలసుబ్రమణ్యం గారు హీరోయిన్స్ పైన కామెంట్స్ చేసారంటే నమ్మబుద్ధి కాదు, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ అయ్యింది. బాలసుబ్రమణ్యం గారు మాట్లాడుతూ “తెలుగు లోనే తెలుగు హీరోయిన్స్ కరువయ్యారు, ఇతర బాషల వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. మిగిలిన బాషలలో వాళ్ళ హీరోయిన్స్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనోళ్లు మాత్రం తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వట్లేదు, ఒక రకంగా చెప్పాలంటే తెలుగు హీరోయిన్స్ కనుమరుగైపోయారు. స్టేజి పైన హీరోయిన్స్ వేసుకొనే పొట్టి పొట్టి దుస్తులు చూసినప్పుడల్లా ఒళ్ళు మండిపోతుంటుంది” అని బాలసుబ్రమణ్యం అన్నారు.

ఆలా చేస్తేనే హీరోలు, నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో.. :

“ఎక్సపోసింగ్ చేస్తూ నిర్మాతలని హీరోలని ఆకర్షించే హీరోయిన్స్ కె ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి, పొట్టి దుస్తులు వేసుకుంటే కానీ ఛాన్సులు రావనుకుంటారో ఏమో, సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషల హీరోయిన్లకే అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు. వారి అంగాంగ ప్రదర్శన చూసి వారికి ఛాన్సులిస్తారు. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను భయపడను. ఏ హీరోయిన్‌కైనా కోపం వచ్చిన పర్లేదు, అయినా వారికి మన బాష రాదు కదా” అని అన్నారు ఆయన.

Comments

comments

Share this post

scroll to top