ఈ 12 రాశుల వారు లక్ కలిసి రావాలంటే…ఎక్కడ టాటూ వేయించుకోవాలో తెలుసా..?

ఒకప్పుడు అంటే ఏమోగానీ నేటి ఆధునిక మోడ్ర‌న్ యుగంలో టాటూ అనేది ఒక ఫ్యాష‌న్ అయిపోయింది. దాన్ని చాలా మంది ప్రెస్టీజ్ ఇష్యూ కోసం కూడా వేయించుకుంటున్నారు. అయితే టాటూ ఎలా వేయించుకున్నా దాంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు అని భావిస్తేనే వేసుకోవాలి. లేదంటే చ‌ర్మం ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌వుతుంది. స‌రే.. టాటూ గురించి జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు తీసుకుంటారు. అది వేరే విష‌యం. కానీ నిజానికి టాటూను శ‌రీరంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వేసుకోకూడ‌ద‌ట‌. అవును, మీరు విన్నది క‌రెక్టే. ఎవ‌రైనా త‌మ రాశి ప్ర‌కారం నిర్దిష్ట‌మైన భాగంలోనే టాటూ వేయించుకోవాల‌ట‌. దీంతో అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని ఆస్ట్రాల‌జీ చెబుతోంది. మ‌రి ఏయే రాశుల వారు త‌మ రాశిని బ‌ట్టి ఏ భాగంలో టాటూ వేయించుకుంటే మంచి జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మేషం
ఈ రాశి వారు త‌మ శ‌రీరంలో వీపుపై టాటూ వేయించుకోవాలి.

2. వృష‌భం
ఈ రాశి వారు త‌మ చేతి మ‌ణిక‌ట్టుపై టాటూ వేయించుకుంటే మంచిది.

3. మిథునం
వీరు త‌మ మెడ‌పై టాటూ వేయించుకోవాల్సి ఉంటుంది.

4. క‌ర్కాట‌కం
ఈ రాశి వారు కాలి పిక్క‌ల‌పై టాటూ వేయించుకోవాలి.

5. సింహ రాశి
వీరు భుజాల‌పై టాటూ వేయించుకోవాలి.

6. కన్య రాశి
వీరు త‌మ చేతి వేళ్ల‌పై టాటూలు వేయించుకుంటే మంచిది.

7. తులా రాశి
వీరు మోచేయి, చేయిపై టాటూల‌ను వేయించుకోవాలి.

8. వృశ్చికం
వీరు మ‌డ‌మ‌ల‌పై టాటూలు వేసుకోవాల్సి ఉంటుంది.

9. ధ‌నుస్సు
వీరు తొడ‌ల‌పై టాటూ వేయించుకోవాలి.

10. మ‌క‌ర రాశి
ఈ రాశి వారు ఛాతిపై టాటూ వేసుకోవాలి.

11. కుంభ రాశి
వీరు పాదాల‌పై టాటూ వేయించుకోవాలి.

12. మీన రాశి
ఈ రాశి వారు చెవుల వెనుక భాగంలో టాటూ వేయించుకుంటే మంచిది.

Comments

comments

Share this post

scroll to top