“రాజా ది గ్రేట్” లో ఐటెం సాంగ్ లో నటించిన టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆ పాటకు ఆమె ఎంత తీసుకుందంటే..!

టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటిస్తూ స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న బ్యూటీ రాశీఖన్నా. త్వరలో ఎన్టీఆర్ సరసన నటించిన జై లవ కుశ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రాశీ.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా ఫాంలో ఉన్న హీరోయిన్లు ఎంత చిన్న క్యారెక్టర్లో నటించినా.. ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు.

అలాంటి రాశీ ఓ స్పెషల్ సాంగ్ ను ఫ్రీగా చేసిందట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ సినిమాలో రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది. అయితే ఆ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడితో ఉన్న స్నేహం కారణంగా ఆ పాటలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిందట రాశీ.

 

Comments

comments

Share this post

scroll to top