చాలా ఏళ్ల త‌రువాత ఆకాశంలో చంద్రుడి అద్భుతం… సూప‌ర్ బ్ల‌డ్ మూన్‌..!

చంద‌మామ రావె… జాబిల్లి రావె… అంటూ త‌ల్లులు త‌మ పిల్ల‌ల‌కు గోరు ముద్ద‌లు తినిపించ‌డం స‌హ‌జ‌మే. ఈ విష‌యం కూడా అంద‌రికీ తెలిసిందే. అంతెందుకు చాలా మంది త‌మ చిన్న త‌నంలో అమ్మ చేతి గోరు ముద్దలు ఇలాగే తిని ఉంటారు. రాత్రి పూట చూడ చ‌క్క‌ని వెలుగును అందిస్తూ అదోలాంటి మ‌ధురానుభూతిని చంద‌మామ క‌లిగిస్తుంది కాబ‌ట్టే పిల్ల‌ల‌కు ఆ మామ‌ను ఆశ చూపించి, లాలించి తిండి పెడ‌తారు. వారు కూడా ఆ మాయ‌లో ప‌డి అంతా తినేసార్తు. అయితే జాబిల్లి కేవ‌లం పిల్ల‌ల‌కే కాదు పెద్ద‌ల‌కు కూడా మ‌ధుర‌మైన అనుభూతిని క‌లిగిస్తుంది.

ప్రేయ‌సీ ప్రియుల‌కు సందేశాల‌ను పంపుతుంది. మ‌న తెలుగు సాహిత్యంలోనైతే జాబిల్లి గురించిన వ‌ర్ణ‌న‌ల‌ను చాలా మంది క‌వులు చేశారు. కానీ ప్ర‌త్యేకంగా శ‌ర‌త్కాలం (ప్ర‌స్తుతం న‌డుస్తోంది అదే) లో వ‌చ్చే వెన్నెలను గురించి ఇంకా ఎక్కువ మంది క‌వులే అభివ‌ర్ణించారు. ఈ కాలంలో వ‌చ్చే వెన్నెల రాత్రులు అంత మ‌ధురంగా ఉంటాయి మ‌రి. అలాంటి మ‌ధుర‌మైన రాత్రి ఈ రోజు రానుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఈ రోజే శ‌ర‌త్కాల‌పు వెన్నెల కురిసే రాత్రి. అయితే ఈ రోజు రాత్రికి కేవ‌లం ఈ ప్ర‌త్యేక‌త ఒక్క‌టే కాదు, మ‌రొక చెప్పుకోద‌గిన స్పెషాలిటీ కూడా ఉంది. అదే సూప‌ర్ బ్ల‌డ్ మూన్‌.

super-blood-moon

పేరుకు త‌గిన‌ట్టుగానే సూప‌ర్ బ్ల‌డ్ మూన్ అంటే చంద్రుడు ఎరుపు, నారింజ రంగుల్లో ఈ రోజు మ‌న‌కు క‌నిపించ‌నున్నాడు. అంతేకాదు సాధారణంగా చంద్రుడు రోజుకు దాదాపుగా 50 నిమిషాలు ఆల‌స్యంగా ఆకాశంలో క‌నిపిస్తాడు క‌దా. కానీ ఈ రోజు మాత్రం 30 నిమిషాలు ముందుగానే మ‌న‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. చాలా ఏళ్ల త‌రువాత ఈ రెండు అద్భుతాలు నేడు చోటు చేసుకోనున్నాయ‌ని ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. చంద్రుడి క‌క్ష్య మార్పుల్లో సంభ‌వించే ప‌రిణామాల వ‌ల్లే ఇలా జ‌రుగుతుంద‌ని వారు అంటున్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో సూప‌ర్ బ్ల‌డ్ మూన్‌ను హంట‌ర్స్ మూన్ అని కూడా పిలుస్తార‌ట‌. ఎందుకంటే ఆ రోజు వెన్నెల కాంతి సాధార‌ణం క‌న్నా చాలా రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. దీంతో వేట‌గాళ్లు, రైతులు రాత్రి పూట కూడా ప‌ని చేసేందుకు వెళ్తార‌ట‌. అందుకే ఈ మూన్‌ను హంట‌ర్స్ మూన్ అని కూడా పిలుస్తార‌ట‌. కాగా చంద్రుడికి చెందిన మ‌రో అద్భుతం కూడా రానున్న న‌వంబ‌ర్ నెల‌లో చోటు చేసుకోనుంద‌ట‌. న‌వంబ‌ర్ 14వ తేదీన చంద్రుడు త‌న స‌హ‌జ సైజ్ క‌న్నా కొంచెం పెద్ద‌గా క‌నిపిస్తాడ‌. దీన్ని సూప‌ర్ మూన్ అని పిలుస్తార‌ట. కాబ‌ట్టి నేడు మాత్ర‌మే కాదు, న‌వంబ‌ర్ 14 రోజు కూడా చంద్రుడి అందాలు, మ‌ధురానుభూతులు ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top