రేప్ కు గురైన కూతుర్ని ఎత్తుకొని వైద్యం కోసం రోజూ 4 K.M నడుస్తున్న తండ్రి.

జోరుగా వర్షం కురుస్తున్నా…. సూర్యుడు భగభగ అని మండుతున్నా.. ఆ తండ్రి తన ప్రయాణం  మాత్రం ఆపడు. ఆ ప్రయాణం రెండు నెలలుగా అలా కొనసాగుతూనే ఉంది. తన తొమ్మిదేళ్ళ కూతురిని  ఎత్తుకొని,  కాలినడకన  4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కు  తీసుకెళ్లి ,  డాక్టర్లుకు చూపించుకొని మళ్లీ 4 కిలోమీటర్లు తిరుగు ప్రయాణం  చేస్తాడు ఆ తండ్రి. అసలు విషయం ఏంటో తెలిస్తే గుండె జల్లుమంటుంది, ఈ చిట్టి తల్లి పడ్డ బాధను గురించి చెబితే మనస్సు చివుక్కుమంటుంది. అసలు మనిషన్న వాడు ఇలా కూడా ఉంటాడా అనే అనుమానం బలపడుతుంది.

సరిగ్గా రెండునెలల క్రితం.. 9 సంవత్సరాల పాపకు ఓ చాక్ లెట్ ఇచ్చి..ముళ్ల పొదళ్లోకి తీసుకెళ్లి ఆమెపై బలత్కారం చేశాడు ఓ రేపిస్ట్  . ఆ చిట్టితల్లి ఎంతగా ప్రాధేయపడుతున్నా  కనికరం కూడా  చూపలేదు  ఆ మానవ మృగం. తీవ్ర రక్తస్రావంతో ఆ చిట్టి తల్లి తల్లడిల్లిపోయింది. నడవడం కాదు కదా.. సరిగ్గా నిలబడడానికి కూడా పనికి రాకుండా చేశాడు ఆ రాక్షసుడు. కీలో మీటరు మేర పాక్కుంటూ పాక్కుంటూ తీవ్ర రక్త స్రావంతో  ఇంటికి చేరింది ఆ 9 యేళ్ళ పాప .

father-300x157

కూతుర్ని ఆ స్థితిలో చూసి ఆ తల్లీదండ్రులు గుండలవిసేలా విలపించారు హుటాహుటిన దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దగ్గర అంటే 4 కిలోమీటర్ల అవతల… ఎందుకంటే అది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం . జార్ఖండ్ కు 200 KM దూరంలో ఉన్న చిన్న  పల్లెటూరు. హాస్పిటల్ లో చేర్పించిన తర్వాత  వైద్యం అందించిన డాక్టర్లు.. డిస్ ఛార్జ్ చేస్తూ.. బ్లీడింగ్ చాలా అయ్యింది.. రోజు డ్రెస్సింగ్ చేయాలి అందుకోసం రోజుకోకసారి పాపను హస్పిటల్ కు తీసుకురావాలని చెప్పారు.

వైద్యం కోసం  డాక్టర్ల దగ్గరికి.. రోజూ  తన కూతుర్ని  ఎత్తుకొని తీసుకెళుతాడీ  ఈ తండ్రి.. సైకిల్ కూడా కొనలేని పేద కుటుంబం. వేరే దారీ లేదు. అయినా సరే కూతురి మీద అంతులేని ప్రేముంది, తన కూతురు త్వరగా  కోలుకొని అందరిలాగే తన కళ్ల ముందు గంతులేయాలనే ఆకాంక్ష బలంగా ఉంది . వీటన్నింటిని ముందు తాను పడుతున్న కష్టం అసలు లెక్కే కాదంటున్నాడు ఆ తండ్రి.

మరో విషయం ఏంటంటే… ఈ ఘటనకు కారణమైన మానవ మృగం.. కొన్ని రోజుల తర్వాత మరో మైనర్ అమ్మాయిని రేప్ చేయబోగ అతడిని పట్టుకున్నారు పోలీసులు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top