రేప్ చేసిన మ‌హిళ‌నే….8 ఏళ్ల త‌ర్వాత జైల్లో పెళ్లి చేసుకున్నాడు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పురూలియా పట్టణానికి చెందిన మనోజ్ బావురీ(30), అదే ప‌ట్ట‌ణానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్ర‌మంలో అత‌డికి జైలు శిక్ష ప‌డింది. అదే స‌మ‌యంలో…రేప్ కు గురికాబ‌డిన మ‌హిళ గ‌ర్భవ‌తి అయ్యింది…. అయిన‌ప్ప‌టికీ అబార్ష‌న్ చేయించుకోకుండా, త‌న క‌డుపులోని బిడ్డ‌ను అలాగే ఎద‌గ‌నిచ్చింది. 9 నెల‌ల త‌ర్వాత మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. సింగిల్ మ‌థ‌ర్ గా త‌న కొడుకును చ‌దివించుకుంటున్న త‌రుణంలో…స్కూల్ లోని పిల్ల‌లు, ఆమె కొడుకును మీ డాడీ ఎక్క‌డ అంటూ ప్ర‌శ్నించ‌డం…. దీంతో, అదే ప్ర‌శ్న‌ను కొడుకు త‌ల్లిని ప‌లు మార్లు అడ‌గ‌డం జ‌రిగాయి.

new-marriage

త‌న కొడుకు కు ఎదుర‌వుతున్న అవ‌మానాలు భ‌రించ‌లేని త‌ల్లి….ట్ర‌య‌ల్ కోర్ట్ కి…త‌న‌ను రేప్ చేసిన వ్య‌క్తే త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని, త‌న ప‌రిస్థితిని వివ‌రించింది,మ‌నోజ్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవ‌డానికి అంగీక‌రించ‌డంతో…వీరి పెళ్లి జైలు అధికారుల స‌మ‌క్షంలో జ‌రిగింది. రేప్ కేస్ లో 8 ఏళ్లుగా శిక్ష అనుభ‌విస్తున్న మ‌నోజ్ కేసు కూడా మ‌రికొన్ని రోజుల్లో కొట్టివేయ‌బ‌డనుంది.క్ష‌ణికావేశంలో ఓ త‌ప్పు చేసిన మ‌నోజ్….ఈ 8 ఏళ్ల జైలు శిక్ష‌లో…త‌న త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

Comments

comments

Share this post

scroll to top