నటుడు రంగనాథ్ చివరి కవిత…. ఎవరు దేవుడంటూ హేతువాదాన్ని లేవనెత్తాడు.

రంగనాథ్ క్యారెక్టర్ ఆరిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో చాలా మంచి పేరును సంపాదించారు.  భేషజాలకు పోయి నిత్యం ఆదిపత్య గొడవలు సర్వసాధారణమైన సినీ ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరు కూడా రంగనాథ్ విరోధులు లేకపోవడం చూస్తే ఆయన మంచితనం ఏంటో తెలుస్తుంది. అయితే  కొన్ని  కారణాల వల్ల రంగనాధ్ తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే, అయితే రంగనాథ్ కు సంబంధించి ఆయన చెప్పిన చివరి కవిత ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరు దేవుడంటూ హేతువాదిగా తన వాయిస్ ను గట్టిగా వినిపించారు రంగనాథ్. ఆ వీడియో మీరు చూడండి.

రంగనాథ్ కవిత టెక్స్ట్ రూపంలో…

ఏదో ఊరి నుండి మహా శిల్పి వచ్చాడు.. మరేదో ఊరినుండి పెద్ద బండ తెచ్చాడు!
ఆరడుగుల కొలతపెట్టి బండను ఖండించాడు.. మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోశాడు!!
ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది.. మూడడుగుల ముక్కబండ చాకిరేవు చేరింది!
కంపు కంపు మనసులన్నీ దేవుడి ఎదుట నిలిచాయి.. కంపుగొట్టే బట్టలన్నీ బండచుట్టూ చేరాయి!!
గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్ధంతో తడిశాయి.. మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి!
అర్ధంకాని స్తోత్రాలతో పూజారి భక్తిశ్రద్ధలు.. చాకలి నోటివెంట ఇస్సు ఇస్సు శబ్ధాలు!
శఠగోపం పవిత్రంగా ప్రతి తలనూ తాకుతోంది.. పవిత్రతకై ప్రతిబట్ట బండను బాదుతోంది!!
కడకు గుడిలోంచి మనసులన్నీ కంపుతోనే వెళ్లాయి.. రేవునుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్లాయి!
గుడిలోని దేవుడా.. రేవులోని బండా.. ఎవరు దేవుడు.. ఎవరు బండ!?
Video రూపంలో:

Comments

comments

Share this post

scroll to top