“రంగస్థలం” విడుదలకు సిద్దమవుతుంది అని సంతోషపడేలోపే…సినిమాకు పెద్ద షాక్..! విడుదల అవ్వనివ్వరా?

 ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన అంచనాలు ఉన్న చిత్రం ‘రంగస్థలం’. రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్ర యూనిట్ సినిమాను జోరుగా ప్రచారం చేస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఐదు పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ ఐదు పాటలను ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రచించడం విశేషం. మంచి లిరిక్స్‌తో దేవీశ్రీ శైలికి విరుద్ధంగా పాటలు ఉన్నాయని ఇప్పటికే చాలా మంది అంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ ఆల్బమ్‌లోని ఓ పాటపై వివాదం తలెత్తింది. ఎం.ఎం.మానసి పాడిన ‘రంగమ్మ మంగమ్మ’ పాటలోని ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే లైన్‌ యాదవ మహిళలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు దాన్ని వెంటనే తొలగించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. యాదవుల పట్ల దర్శకుడు, నిర్మాత, రచయితల‌ వైఖరి సరికాదన్నారు. పాటలోని ఆ పదాలను వెంట‌నే తొలగించాలని, లేదంటే సినిమా ప్రద్శనను అడ్డుకుంటామ‌ని హెచ్చరించారు.

సాధారణంగా ఈ మధ్య కాలంలో భారీ అంచనాలున్న సినిమాలపై ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. ముఖ్యంగా తమ మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో డైలాగులు, పాటలు ఉన్నాయంటూ ఇప్పటికే చాలా సినిమాలపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ మధ్య వచ్చిన ‘డీజే – దువ్వాడ జగన్నాథం’ పాట విషయంలో కూడా బ్రాహ్మణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ‘రంగస్థలం’ పాటకు యాదవులు అభ్యంతరం తెలుపుతున్నారు. మరి దీనిపై ‘రంగస్థలం’ దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 1985 కాలం నాటి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అన్ని హంగులు ఉంటాయని చిత్ర యూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది.

Comments

comments

Share this post

scroll to top