“రంగస్థలం” ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..! ఫారిన్ రివ్యూ ప్రకారం సినిమా ఎలా ఉందంటే.? హిట్టా.?

భారీ అంచనాల మధ్య విడుదల:

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం “రంగస్థలం”. సినిమా మొదలైనప్పటి నుండి సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇటీవల విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కూడా అందరిని ఆకట్టుకున్నాయి.

చిట్టి బాబుగా చరణ్:

చరణ్ ఈ తరహా పాత్రలో గతంలో నటించలేదు. రంగస్థలం లాంటి చిత్రం కూడా తెలుగులో ఈ మధ్య కాలంలో రాలేదు. ఈ శుక్రవారం రంగస్థలం చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రంగస్థలం చిత్రానికి సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. యూఏఈ నుంచి రంగస్థలం చిత్రానికి తొలి రెస్పాన్స్ అదిరిపోయింది. రాంచరణ్ చిట్టిబాబుగా మారి సందడి చేయబోతున్నాడు. 1985 నాటి పరిస్థితులకు అనుగుణంగా చరణ్ ఏవిధంగా నటిస్తాడో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. చరణ్ వంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోని వినికిడి లోపంతో చూపించడం అంటే సాహసమే. కానీ అదే అంశం అభిమానులకు బాగా చేరువైంది.

పల్లెటూరి నేపథ్యం:

పల్లెటూరి రాజకీయ నేపథ్యంలో బలమైన కథతో ఈ చిత్రం సాగనుంది. టైలర్ లో చూపిన విధంగా ఈ చిత్రంలో ఆకట్టుకునే రాజకీయ అంశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. హీరో ఆది పినిశెట్టి రామ్ చరణ్ సోదరుడిగా నటించాడు.

రామలక్ష్మిగా సమంత:

ఎలాంటి పాత్రకైనా తనదైన పెర్ఫామెన్స్ తో న్యాయం చేయగలిగే నటి సమంత. సమంత ఈ చిత్రంలో పేదింటి పల్లెటూరి అమ్మాయిగా రామలక్ష్మిగా కనిపించబోతోంది.

జిగేలు రాణిగా పూజ హెగ్డే:

జిగేలు రాణి ఐటెం సాంగ్ కి దేవిశ్రీ మ్యూజిక్ ఒక ఎత్తు, రామ్ చరణ్ స్టెప్పులు మరొక ఎత్తు. అన్నిటికి మించి పూజ హెగ్డే గ్లామర్ బి,సి ఆడియన్స్ ని ఆకట్టుకోవడం పక్కా.!

రంగస్థలం చిత్రం కాసులు కురిపించే పైసా వసూల్ కలర్షియల్ చిత్రం అని ఉమర్ సందు కితాబిచ్చాడు. రాంచరణ్, జగపతి బాబు మరియు సమంత అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టినట్లు ఉమర్ తెలిపాడు. ఉమర్ సందు రంగస్థలం చిత్రానికి తాను ఇచ్చే రేటింగ్ 3.5 అని పేర్కొన్నాడు. అద్భుతమైన కథ, సుకుమార్ దర్శకత్వం, ఆకట్టుకునే దేవిశ్రీ సంగీతం చిత్రానికి కలసి వచ్చే అంశాలుగా ఉమర్ పేర్కొనడం విశేషం.

Comments

comments

Share this post

scroll to top