బాహుబలి సినిమా లో యద్దానికి ముందు సీన్ గుర్తుందా? రానా, బాహుబలి యుద్దానికి వెళతారు, ప్రభాస్ గుర్రంపై కత్తి తీసుకోని వెళితే, రానా గుర్రపు బండికి ముందు కత్తులను ఫ్యాన్లుగా ఏర్పాటు చేసుకొని కదనరంగంలోకి దూసుకెళతాడు. ఈ సీన్ కు థియేటర్లలో విజిల్స్ అదిరిపోయాయ్. ట్రెడేషనల్ లో కాస్త టెక్నాలజీ ఉపయోగించి రానా చేసిన ఆ యుద్దం మస్తు ఎంటర్టైన్మెంట్ ను పంచింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే వాహనం నడిరోడ్డుపై రయ్య్ అని దూసుకుపోతోంది.
అవును ఇది నిజం, మరి రానా వాహనాన్ని తయారు చేయడానికి రాజమౌళి ఇతనిని నుండి ప్రేరణ పొందాడో లేదో తెలియదు కానీ, అతను మాత్రం అచ్చుగుద్దినట్టు బాహుబలి లో రానా యుద్దానికి వాడిన వాహనాన్నే వాడాడు. వాడడమే కాదు దాన్ని ఓ మంచి కార్యం కోసం రోడ్డుపై రయ్ అంటూ తిప్పుతున్నాడు. అసలు విషయం ఏంటంటే అతడు రోడ్లను శుభ్రంచేసే సఫాయి కార్మికుడు. ఆశ్చర్యంగా ఉందా….
అయితే ఈ వీడియో మీరే చూడండి.. తన డ్యూటీలో భాగంగా, పనిని ఫాస్ట్ గా, క్లీన్ గా చేయడం కోసం ఈ టెక్నాలజీ యూజ్ చేశాడు ఆ కార్మికుడు . ఎట్ ఏ టైమ్ ఎనమిది చీపుర్లు…ఇక చూస్కో అద్దంలా మెరవాలి రోడ్లు.!!