బాహుబలిలో “రానా” యుద్ధ రథం గుర్తుందా..? రొటేటింగ్ బ్లేడ్స్ తో ఆ వాహనం తయారు చేసింది ఎవరో తెలుసా..?

“బాహుబలి” ఈ చిత్రం ప్రపంచానికి తెలుగు సినిమా పరిశ్రమను పరిచయం చేయటమే కాదు “ప్రభాస్, రానా” లకు కూడా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. “దగ్గుబాటి” కుటుంబం నుండి వచ్చిన “రానా” తనదైన శైలిలో సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ ఉన్నాడు. “బాహుబలి” లో “భల్లాలదేవ” గా చేసే బెస్ట్ విలన్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ పాత్రకోసం రానా ఎంతో కష్టపడ్డాడు. జిం లోనే ఎక్కువ సేపు ఉండేవాడు అట.

“బాహుబలి” మొదటి భాగంలో యుద్ధ సన్నివేశాల్లో “భల్లాలదేవ” ఉపయోగించిన వాహనం గుర్తుందా..? ముందు గుర్రాలతో ఉంటుంది. రెండో భాగంలో ఎద్దులతో ఉంటుంది. ఆ వాహనం ప్రత్యేకత ఏంటి అంటే “ముందు ఉండే బ్లేడ్స్”… ఆ బ్లేడ్స్ రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి. ఆ బ్లెడ్స్ తిరగడం గ్రాఫిక్స్ తో చేసింది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే..! ఒకసారి ఆ వెహికల్ లుక్ వేసుకోండి!

పవర్ఫుల్ వెపన్స్ తో ఉన్న ఆ రథం తయారు చేసింది ఎవరో తెలుసా..? బులెట్ బైక్ తయారు చేసే కంపెనీ “రాయల్ ఎంఫిల్డ్ (ROYAL ENFIELD)“. బాహుబలి టీం కోసం రాయల్ ఎంఫిల్డ్ వారు ఆ రథంను ఎక్కువ హార్స్ పవర్ ఇంజిన్ తో తయారు చేసారు.

Comments

comments

Share this post

scroll to top