రాజమౌళికి రానా ఇవ్వనున్న గురుదక్షిణ..బాహుబలి బడ్జెట్ కంటే డబుల్!

బాహుబలి సినిమా తర్వాత  రానా కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు చారిత్రాత్మక స్కోప్ ఉన్న పాత్రలకు రానాకు ఆఫర్ల మీద ఆపర్లు వస్తున్నాయ్. తెలుగు ఇండస్ట్రీ నుండే కాక బాలీవుడ్ నుండి కూడా రానా ఫోన్ కు కాల్స్ వస్తున్నాయట! అయితే తన కెరీర్ కు ఇంత సక్సెస్ ను ఇచ్చిన రాజమౌళి కి గురు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాడట రానా… అందుకు ఓ ప్లాన్ సిద్దం చేసుకున్నాడు.

అదేంటంటే రాజమౌళి డైరెక్షన్లో మహాభారతాన్ని తెరకెక్కించాలనుకుంటున్నాడట, ఇందులో సహ నిర్మాతగా కూడా వ్యవహరించాలనుకుంటున్నాడట రానా ,దీని గురించి ఈ పాటికే రాజమౌళితో సంప్రదింపులు కూడా చేసినట్టు సమాచారం.   ఈమాట  రాజమౌళియే తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట!

For FaceBook Updaes: రాజమౌళికి రానా ఇవ్వనున్న గురు దక్షిణ.

Baahubali Rana Working Stills

 

మరో విషయం ఏంటంటే ..రాజమౌళి డైరెక్షన్లో  రానా తీయబోయే సినిమాకు బాహుబలి సినిమాకు అయిన ఖర్చుతో పోల్చితే రెండితల బడ్జెట్ పెట్టడానికి కూడా రెడీ అయిపోయారంట, మొత్తం  మహాభారతాన్నే తెరకెక్కిస్తారా? లేక అందులో కొంత భాగాన్ని తీసుకొని తెరకెక్కిస్తారా అనేది ఇంకా ఫైనలైజ్ కాకున్నా.. రానా, రాజమౌళీల కాంబినేషన్ లో మాత్రం చిత్రం నిర్మించడం తధ్యం అంటున్నాయ్ ఫిల్మ్ నగర్ వర్గాలు.

 

రానా తండ్రి ప్రొడ్యూసర్ కావడం దీనికి బలం చేకూర్చుతున్నాయ్. దీనికి తోడు రామాయణ,మహాభారత కథలే నా సినిమాలకు ప్రేరణ అనే రాజమౌళి మాటలను బట్టి చూస్తే కూడా మహాభారతం సినిమాకి తొందర్లోనే క్లాప్ కొట్టేలా కనిపిస్తుంది.

CLICK:  అభిమానులకు బంపర్ ఆఫరిచ్చిన రాజమౌళి!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top