“రానా” నటించిన “ఘాజీ” స్టోరీ, రివ్యూ, రేటింగ్ (తెలుగులో)

Movie Title: ఘాజీ (Ghazi)

Cast & Crew:

 • నటీనటులు: రానా ద‌గ్గుబాటి, కె.కె.మీన‌న్‌, అతుల్ కుల‌క‌ర్ణి, తాప్సీ, నాజ‌ర్‌, ఓంపురి, రాహుల్ సింగ్‌, స‌త్య‌దేవ్‌, ర‌వి వ‌ర్మ‌, ప్రియ‌దర్శి త‌దిత‌రులు
 • దర్శకుడు: సంక‌ల్ప్
 • సంగీతం: కె(కృష్ణ కుమార్)
 • నిర్మాత: ప‌ర‌మ్ వి.పొట్లూరి, క‌విన్ అన్నె (మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, పివిపి సినిమా)

Story:

భార‌త్‌ను భౌగోళికంగా, మానసికంగా దెబ్బ తీయాల‌నే దేశం పాకిస్థాన్‌. 1971లో తూర్పు పాకిస్థాన్‌, ప‌శ్చిమ పాకిస్థాన్ అని రెండుగా విడిపోయి కొట్టుకోవ‌డం మొద‌లు పెట్టింది. తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం కోసం చేస్తున్న పోరాటంలో భార‌త‌దేశ ప్ర‌మేయం ఉంద‌ని పశ్చిమ పాకిస్థాన్ భావించి, భార‌త్‌ను దెబ్బ తీయాల‌నుకుంటుంది. అందులో భాగంగా భార‌త నేవీకు సంబంధించిన ఐ.ఎన్‌.ఎస్‌.విక్రాంత్‌ను నాశనం చేయ‌డానికి, ఏదైనా ఓడ‌రేవును ధ్వంసం చేయాల‌నుకుంటుంది. అందుకు వైజాగ్ స‌ముద్ర ప్రాంతాన్ని ఎంచుకుంటుంది పాకిస్థాన్‌. అయితే పాకిస్థాన్ కుయుక్తుల‌ను అర్థం చేసుకున్న ఇండియ‌న్ నేవీ, భార‌త స‌ముద్ర జలాల్లోకి ఎస్‌21 అనే సబ్ మెరైన్‌ను గ‌స్తీకి నియ‌మిస్తుంది. ఈ స‌బ్‌మెరైన్‌కు ర‌ణ్ విజ‌య్ సింగ్‌(కె.కె.మీన‌న్‌) కెప్టెన్‌. అయితే ర‌ణ్ విజ‌య్ సింగ్ ఆవేశాన్ని కంట్రోల్ చేయ‌డానికి తోడుగా క‌మాండ‌ర్ అర్జున్ వ‌ర్మ‌(రానా ద‌గ్గుబాటి)ని ప్ర‌భుత్వం పంపుతుంది. అయితే పాకిస్థాన్ పంపిన ఘాజీ స‌బ్‌మెరైన్ భార‌త్ మెరైన్స్ క‌న్నా ఎన్నో రెట్లు బ‌లమైన‌ది. మ‌రి ఘాజీని ఎదుర్కొన‌డానికి ర‌ణ్ విజ‌య్ సింగ్‌, అర్జున్ వ‌ర్మ‌లు ఏం చేస్తారు? చివ‌ర‌కు భార‌త్ అండ‌ర్ వాట‌ర్ వార్‌లో గెలిచిందా? మ‌రి ఈ యుద్ధం గురించి బ‌య‌ట వారికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌డానికి కార‌ణాలేంటి? అనే సంగ‌తులు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….

Review:

కమర్షియల్ గా హిట్ అవ్వకపోయిన…సినిమా చరిత్రలో నిలిచిపోతుంది…రానా నటనని ప్రశంసించకుండా ఉండలేము!…ఆర్మీ కి దేశం పై ఉన్న ప్రేమని చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో..సినిమా చూస్తుంటే దేశం కోసం ఏదైనా చేయాలి అన్న ఫీల్ లోకి వెళ్ళిపోతాము…సంకల్ప్ “స్టోరీ, స్క్రీన్ప్లే” తో ఆడియన్స్ ని ఆకట్టకున్నాడు…అన్నిటికంటే ముఖ్యంగా ఎమోషన్ ని బాగా క్యారీ చేసింది మ్యూజిక్…చివరి 20 నిమిషాలు ఉండే యుద్ధ సన్నివేశాలు ఈ సినిమా కి హైలైట్…సబ్ మెరైన్ చూపించడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారని చెప్పాలి!…విసుఅల్స్ కూడా చాలా బాగున్నాయ్!

Plus Points:

 • రానా నటన
 • స్టోరీ
 • స్క్రీన్ప్లే
 • విభిన్న కాన్సెప్ట్
 • సినిమాటోగ్ర‌ఫీ
 • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

Minus Points:

 • కథని స్లో గా చిత్రీకరించారు
 • కొన్ని ఆక్షన్ చిత్రాలు
 • డబ్బింగ్

Final Verdict:

ఇండియన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా అని చెప్పొచ్చు!…రానా తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు…ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడ తగ్గలేదు..ఆక్షన్ పెరఫార్మన్సెస్, విసుఅల్స్ కోసం ఈ సినిమా తప్పక చూడాల్సిందే!

AP2TG Rating: 3.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top