రానా పేరు తాత నుండి వచ్చిందే!!!

రానా టాలీవుడ్ లో హాలివుడ్ రేంజ్ హీరో, అరడుగుల ఆజానుబాహుడు , హిందీ చిత్రాల్లో కూడా తనదైన  ముద్రవేసుకున్న దగ్గుబాటి వారసుడు. ఈరోజు తన తాత దగ్గుపాటి రామానాయుడు 79వ జయంతి. తన తాతకు నివాళులు అర్పిస్తూ.. అలనాటి  జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు.

rana daggubati

రామానాయుడు లో మొదటి అక్షరాన్ని మూడవ అక్షరాన్ని కలిపి ఆ పేరు ఫిక్స్ చేశారంట, తన తాత పేరు తన తల్లి తండ్రులు తనకు పెట్టడంతో రామానాయుడు స్థాయికి ఎదగక పోయినా ఆయన కీర్తిని చెడగొట్టే పనులు చేయను అంటున్నాడు రానా. తన చిన్నప్పుడు తాతతో కలిసి  చేసిన లాంగ్ జర్నీనీ, తాతలోని క్రమ శిక్షణా, సమయపాలన గురించి  మీడియాతో పంచుకున్నాడు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top