హీరో రానా రైతు బజార్లో బస్తాలు మోశారు. ఇదేదో సినిమా షూటింగ్ లో భాగంగా చేసింది కాదు. నిజంగా చేసింది. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు రానా. మంచులక్ష్మీ చేపడుతున్న మేము సైతం అనే కార్యక్రమానికి టాలీవుడ్ నటులు తమవంతు సాయం అందిస్తూ…వినూత్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దానిలో భాగంగానే రానా కూలీ అవతారం ఎత్తాడు. ఖాకీ బట్టలు ధరించి తలకి.. ఎర్ర టవల్ చుట్టుకొని బస్తాలు మోస్తున్న వీడియో ఇందులో ఉంది.
వాస్తవానికి రానా సోషల్ యాక్టివిటీస్ లో చాలా ముందుంటాడు. సినిమా వాళ్ళ ప్రతి కార్యక్రమం కూడా రానా పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది. బాహుబలి సినిమా తర్వాత భల్లాలదేవ గా రానా ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హిందీ లో కూడా రానా చాలా పేరు సంపాదించుకున్నాడు. రుద్రమదేవి సినిమాలో కూడా రానా అనుష్క సరసన నటించి మెప్పించాడు.
Watch Video:Rana @ Coolie