వేశ్యగా మారింది డబ్బు కోసం కాదు రమ్య కృష్ణ సంచలన కామెంట్స్ !!

దక్షిణాదిలో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఇప్పుడు ఓ వేశ్యగా కనిపించనున్నారు. బాహుబలి లో తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న రమ్యకృష్ణ ఇప్పుడు సూపర్ డీలక్స్ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు త్యాగరాజన్ కుమార రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి, సమంత నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రమ్యకృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


రమ్యకృష్ణ మాట్లాడుతూ…. “సూపర్ డీలక్స్ లో నా పాత్ర గురించి నా కన్నా నా అసిస్టెంట్లే ఎక్కువగా షాక్ అయ్యారు. కొన్ని పాత్రలు డబ్బు కోసం, పాపులారిటీ కోసం చెయ్యాల్సి వస్తే ఇలాంటి పాత్ర మాత్రం నటనపై ఉండే ఆసక్తితో చేసా” అని రమ్యకృష్ణ అన్నారు.
దర్శకుడు కథ చెప్పిన విధానం అతనికి సినిమా పట్ల అతడికి ఉన్న నమ్మకం, ధైర్యం చూసి సూపర్ డీలక్స్ లో వేశ్య పాత్ర చెయ్యడం కోసం అంగీకరించా. కేవలం దర్శకుడిపై నమ్మకంతోనే వేశ్య పాత్రలో నటించాను. కెరీర్ లో కొన్ని సార్లే అవకాశాలు తలుపు తడతాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి అని రమ్యకృష్ణ పేర్కొన్నారు.

బాహుబలిలో శివగామి తర్వాత నాకు బాగా నచ్చిన పాత్ర లీలా. సూపర్ డీలక్స్‌లో నటనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న లీలా అనే వేశ్యగా కనిపిస్తాను. దక్షిణాది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే కథా చిత్రమని బలంగా చెబుతాను. ఈ పాత్రతో మరోసారి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఖాయం అనే ధీమాను రమ్యకృష్ణ వ్యక్తం చేశారు.

Comments

comments

Share this post

scroll to top